Share News

KTR: సిగ్గుందా ఈ కాంగ్రెస్ పార్టీకి

ABN , First Publish Date - 2023-10-19T15:44:41+05:30 IST

మంత్రి కేటీఆర్‌, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్విట్టర్‌‌ వేదికగా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా మారోసారి కాంగ్రెస్, రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.

KTR: సిగ్గుందా ఈ కాంగ్రెస్ పార్టీకి

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌, (Minister KTR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్విట్టర్‌‌ వేదికగా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా మారోసారి కాంగ్రెస్, రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. 11 సార్లు ఛాన్స్ ఇస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడెలా ఇస్తారని.. సిగ్గుందా ఈ కాంగ్రెస్ పార్టీకి అంటూ విరుచుకుపడ్డారు. ఫ్లోరోసిస్‌తో అల్లాడుతున్న నల్లగొండకు చేసందేమి లేదన్నారు. ‘‘మాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుకుంటున్నారు.. ఎన్నికల్లో ఆగమాగం అయ్యి ఓట్లు వేయకండి. విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. ఎక్కడిక్కడ కాంగ్రెస్‌ను నిలదీయండి. రాహుల్ గాంధీ (Rahul Gandhi),ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) కూడా కుటుంబ పాలన అంటున్నారు. సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు ఒక కుటుంబం కాదా. వీళ్ళు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం లో లక్ష కోట్ల అవినీతి అంటున్నారు. కట్టిందే 80 వేల కోట్లతో. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది. రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్. రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతరు. రాహుల్ పక్కన ఉన్న రేవంత్ రెడ్డి అవినీతి పరుడు కాదా. రేవంత్ రెడ్డి ఒక 420. రేవంత్ రెడ్డి కంటే అవినీతి పరుడు ఎవరు లేరు. ఓటుకు నోటు కేసులో దొరకిన దొంగ రేవంత్ రెడ్డి. A to z స్కాం చేసింది కాంగ్రెస్. ఆకాశం నుంచి భూమి లోపల దాకా కుంభకోణాల. మేము బీజేపీ బీ టీమ్ కాదు. మీరే సీ టీమ్. సీ- చోర్ టీమ్. కాంగ్రెస్ ఎన్ని గెలిచిన మళ్ళీ బీజేపీ లో చేరుస్తాడు రేవంత్ రెడ్డి. బీజేపీ కోవర్ట్ రేవంత్ రెడ్డి. గంప గుత్తగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేరుస్తాడు’’ అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-10-19T16:31:24+05:30 IST