CPI Narayana: ఢిల్లీ లిక్కర్ స్కాంపై సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-10-04T16:20:06+05:30 IST
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)పై సీపీఐ సీనియర్ నేత నారాయణ( CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)పై సీపీఐ సీనియర్ నేత నారాయణ( CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు ఆయన ABNతో మాట్లాడుతూ..‘‘ఈ లిక్కర్ స్కాంలో సిసోడియాను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు? లిక్కర్ స్కాంలో ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ నేతలు సేఫ్‌గా బయట ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలది అండర్ స్టాండింగ్‌తో కూడిన ముద్దులాట, గుద్దులాట మాత్రమే. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లలేదంటే.. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాబట్టే వెళ్లలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు దిగజారుడు తనానికి పరాకాష్ఠ. సీఎం కేసీఆర్ ఆఫ్ ది రికార్డ్ మాటలను ప్రధాని మోదీ బయట పెట్టడం అనైతికం. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదని చెప్పేందుకే మోదీ తాపత్రయం పడుతున్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి దేశానికి అవమానకరంగా మాట్లాడారు. కేసీఆర్ అవినీతిపై మోదీ సర్కార్ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. జాతీయస్థాయి తరహాలోనే తెలంగాణలోనూ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలిస్తే బాగుంటుంది. ఏపీలోనూ టీడీపీ, జనసేనతో కలసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తాం’’ అని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.