Chada Venkata Reddy : రాజకీయ విలువలను పతనం చేస్తోన్న కల్వకుంట్ల కుటుంబం

ABN , First Publish Date - 2023-10-01T17:42:30+05:30 IST

గ్రూప్ వన్ పరీక్ష రద్దు ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy) వ్యాఖ్యానించారు.

Chada Venkata Reddy : రాజకీయ విలువలను పతనం చేస్తోన్న కల్వకుంట్ల కుటుంబం

సిద్దిపేట: గ్రూప్ వన్ పరీక్ష రద్దు ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘టీఎస్సీఎస్సీ పరీక్ష నిర్వాహణలో చట్టబద్ధమైన విధానాలు పాటించలేదు, దోషులేవలో గుర్తించి కఠినంగా శిక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయలేదు, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదు. రాష్ట్రంలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది, ప్రజాస్వామ్యం అపహస్యం అవుతోంది. రాజకీయ విలువలను కల్వకుంట్ల కుటుంబం పతనం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారు, రాజకీయ జోక్యం తగదు, ఈ విధానాన్ని ఖండిస్తున్నాం. గ్రామసభలు, అధికారుల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయాలి’’ అని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-01T17:42:30+05:30 IST