AP News:ఎన్నికల సంఘానికి అచ్చెన్న లేఖ.. కారణమిదే..?
ABN , Publish Date - Mar 25 , 2024 | 04:49 PM
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకి తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని చెప్పారు.
అమరావతి: ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena)కి తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని చెప్పారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సంచిత నిధి నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానా ఖర్చుతో అధికార పార్టీ పనులు చేస్తున్నారని చెప్పారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మార్చి 18, 22వ తేదీల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు చేశారని అన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం రాజకీయ నాయకులు, అధికారుల మధ్య వ్యక్తిగతంగా లేదా సమష్టిగా వీడియో కాన్ఫరెన్సులు నిషేధించినట్లు చెప్పారు. అందుకు విరుద్ధంగా వైసీపీ నాయకులు, అభ్యర్థులతో సజ్జల భేటీలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఐపీసీ 171 మరియు 123, 129, 134 మరియు 134A సెక్షన్ల ఉల్లంఘన మరియు RP 1951 యాక్ట్‌కు విరుద్ధంగా సజ్జల వ్యవహరించారని చెప్పారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించనందుకు గానూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాలని ఈసీని అచ్చెన్నాయుడు కోరారు.
ఇవి కూడా చదవండి
Chandrababu Live: కుప్పం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి
Budda venkanna: మంగళగిరిలో లోకేష్‌ను ఓడించటానికి రూ.500 కోట్లు దాచారు..
AP Politics: త్వరలోనే భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తా.. ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి