Share News

Chandrababu: మళ్లీ జగన్‌కు ఓటేస్తే అందర్నీ గంజాయికి బానిసలను చేస్తాడు

ABN , Publish Date - Mar 29 , 2024 | 09:15 PM

ఏపీని లక్షల కోట్ల అప్పుల్లోకి సీఎం జగన్ (CM Jagan) తీసుకెళ్లారని తెలుగుదేశం(TDP) అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అన్నారు. శుక్రవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని వింజమూరు ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: మళ్లీ జగన్‌కు ఓటేస్తే అందర్నీ గంజాయికి బానిసలను చేస్తాడు

నెల్లూరు: ఏపీని లక్షల కోట్ల అప్పుల్లోకి సీఎం జగన్ (CM Jagan) తీసుకెళ్లారని తెలుగుదేశం(TDP) అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అన్నారు. శుక్రవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని వింజమూరులో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌రెడ్డిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి లేని ప్రాంతం లేదని.. మళ్లీ ఈ దుర్మార్గుడికి ఓటేస్తే, అందర్నీ గంజాయికి బానిసలుగా మారుస్తాడని ధ్వజమెత్తారు.

TDP MLA Candidates: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్.. గంటా పోటీ ఎక్కడ్నుంచంటే..?

మొన్ననే వైజాగ్‌లో రూ.25వేల కోట్ల డ్రగ్స్ ఇంపోర్టు చూశామన్నారు. జగన్‌కి ఈ కేసుతో సంబంధం లేకపోతే ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఆయన బాబాయి(వివేకా) హత్యని అడ్డం పెట్టుకుని, కోడికత్తి డ్రామా ఆడి గత ఎన్నికల్లో గెలిచాడా? లేదా? అని ప్రశ్నించారు. పాపం వివేకా కూతురు సునీత న్యాయం చేయమంటే, చేశాడా? అని నిలదీశారు. బాబాయిని హత్య చేసిన నిందితులను పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడని విరుచుకుపడ్డారు. బాబాయిని ఎవరు హత్యచేశారో చెప్పమని చెల్లెలు సునీత అడిగిన ప్రశ్నకి జగన్ ఎందుకు సమాధానం చెప్పట్లేదని చంద్రబాబు ప్రశ్నించారు.


KTR: వారిద్దరూ ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్

ఉదయగిరిలో నీటి సమస్యలను పరిష్కరిస్తా...

కరెంటు ఛార్జీలు అప్పుడు రూ.200లు ఉంటే, ఇప్పుడు రూ.1000లు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. 5 ఏళ్ల కరెంటు బిల్లుల బాదుడెంతో లెక్కపెట్టాలని అన్నారు. జగన్ ఒక సైకో అని.. రూ.10లు ఇచ్చి రూ.100లు దోచుకున్నాడని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు, పెట్రోలు, నూనె, పప్పులు, చింతపండు, చివరికి ఉప్పు ధరలు కూడా పెరిగాయని... రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యాన్ని తాకట్టు పెట్టి రూ.25వేల కోట్లు అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని మండిపడ్డారు. సంపద సృష్టించిన పార్టీ టీడీపీ అని చెప్పారు. మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనతో కలిసి వచ్చారని చంద్రబాబు తెలిపారు.

ఈ ఎన్నికల్లో వ్యతిరేఖ ఓటు చీలకూడదని మనతో పవన్ కలిశారన్నారు. బీజేపీ కూడా తమతో కలిసి వచ్చిందని తెలిపారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికే ఈ పొత్తు అని వివరించారు. తాను రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తే, జగన్ సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ఏపీకి రాజధానిని లేకుండా నాశనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం హైదరాబాద్, బెంగుళూరుకి వెళ్లడం నామూషీనా? కాదా? అని నిలదీశారు. ఉదయగిరిలో తాగు, సాగునీటి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. సంపద సృష్టించి, నిరంతరం పేదలకు అందేలా చూస్తానని చంద్రబాబు తెలిపారు.


జగన్‌కి కేసులు పెట్టడమే తెలుసు

ఉదయగిరిలో సైకిల్ దూసుకుపోతుందని అన్నారు. ఉదయగిరిలో సాగునీరుకి సంబంధించి జగన్ ప్రభుత్వం ఒక చిన్నపని అయినా చేసిందా? అని ప్రశ్నించారు. ఏపీలో ఎక్కడ చూసినా యువతే కనిపిస్తోందని.. మీ జీవితాలతో జగన్ ఆడుకున్నాడా? లేదా? మెగా డీఎస్సీ ఇచ్చాడా? లేదా అని నిలదీశారు.

సీఎం జగన్‌కి కేసులు పెట్టడం, భయపెట్టడం, భయభ్రాంతులకి గురిచేయడమే తెలుసునని అన్నారు. అభివృద్ధి తెలియని చెత్త సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు. సమయం లేదు మిత్రమా... మే 13వ తేదీ... మనమందరం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈ చేతకాని ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


BJP-BRS: బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్.. రఘునందన్ స్ట్రాంగ్ కామెంట్స్..

పింఛను పెంచుతాం

రైతులకు సబ్సిడీలిస్తాం‌. యంత్రాలు, విత్తనాలు ఇస్తామని... రైతులను రాజులుగా చేస్తామన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెలా భృతి‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది పాతిక లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. తన మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేస్తానని అన్నారు. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు వచ్చేలా చూస్తానని ప్రకటించారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు ఏపీకి తెస్తానని అన్నారు. తమ హయాంలో పదిరెట్లు పింఛను‌ పెంచామా లేదా? ముక్కుతూ మూలుగుతూ జగన్ రూ. వెయ్యి పెంచాడన్నారు.

అధికారంలోకి వస్తే రూ.4వేలు పింఛను ఇస్తామన్నారు. మూడు నెలలు వరసగా తీసుకోపోయినా పింఛను ఇస్తామని వివరించారు. బీసీల్లో యాభై ఏళ్లు నిండిన వారికి పింఛను ఇస్తామన్నారు. సామాజిక న్యాయానికి టీడీపీ పెద్ద పీట వేసిందని చెప్పారు. అన్ని కులాలకు సమాన న్యాయం చేస్తామన్నారు. తనపేరు చెబితే హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, రింగ్ రోడ్డు, పోలవరం, పట్టిసీమ, కంపెనీలు గుర్తుకొస్తాయని చెప్పారు. 5ఏళ్లు సీఎంగా ఉన్న జగన్ పేరు చెబితే, ఏమీ గుర్తుకు రావని చంద్రబాబు సెటైర్లు వేశారు.

Komatireddy Venkatareddy: త్వరలో సినిమా థియేటర్లపై రైడ్స్.. కోమటిరెడ్డి సంచలనం

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 09:40 PM