Share News

Tirumala Laddu issue: లడ్డూ వివాదంలో కేంద్రం సీరియస్.. ఆ కంపెనీకి నోటీసులు..

ABN , Publish Date - Sep 23 , 2024 | 06:28 PM

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తిరుమలకు నెయ్యి సరఫరా చేసే నాలుగు కంపెనీలకు చెందిన నమూనాలు సేకరించింది.

Tirumala Laddu issue: లడ్డూ వివాదంలో కేంద్రం సీరియస్.. ఆ కంపెనీకి నోటీసులు..

ఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యింది. నెయ్యి తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించని తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో స్వామివారి ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసే నాలుగు కంపెనీలకు చెందిన నమూనాలు సేకరించింది.


ఈ మేరకు వాటి నాణ్యతపై పరీక్షలు నిర్వహించింది. వాటిలో మూడు కంపెనీలు సరైన ప్రమాణాలు పాటించినట్లు గుర్తించింది. అయితే తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ మాత్రం నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు సరైన ప్రమాణాలు పాటించకుండా కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న ఆ కంపెనీకి FSSAI(ఫుడ్ స్టాండర్డ్స్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.


మరోవైపు.. లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని అతని వాహనంలోనే తిరుపతికి తరలించారు. అయితే కొన్ని రోజులుగా తన మనస్సు తల్లడిల్లిపోతోందని, తాను ఏ తప్పూ చేయలేదని కరుణాకర్ రెడ్డి చెప్పారు. తన హయాంలో జంతువుల కొవ్వు కలపలేదని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఏదైనా తప్పు చేసి ఉంటే తనతోపాటు కుటుంబం మెుత్తం నాశనం అయిపోతామని చెప్పుకొచ్చారు. కుట్రపూరితంగానే కూటమి నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కరుణాకర్ రెడ్డి చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Parthasarathi: వారిని వెంటనే అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది

Tirumala Laddu Issue: జగన్‌కు మరక అంటకుండా.. పందికొవ్వును పుత్తడితో పోల్చిన పొన్నవోలు..

Pawan Kalyan: టీటీడీ ఆస్తులను దోచేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు

Updated Date - Sep 23 , 2024 | 07:27 PM