Share News

Rapaka Prasada Rao: వైసీపీ దోస్తీకి గుడ్ బై చెప్పిన రాపాక వరప్రసాదరావు..

ABN , Publish Date - Oct 13 , 2024 | 07:23 PM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. 2019ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచి వైసీపీకి అనుకూలంగా వ్యవహించిన కోమసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు.

Rapaka Prasada Rao: వైసీపీ దోస్తీకి గుడ్ బై చెప్పిన రాపాక వరప్రసాదరావు..
Rajolu former MLA Rapaka Varaprasada Rao

కోమసీమ జిల్లా: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. 2019ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచి వైసీపీకి అనుకూలంగా వ్యవహించిన కోమసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ పెద్దలకు తెలిజేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో వైసీపీకి ఆయన భారీ షాక్ ఇచ్చినట్లు అయ్యింది. తాను జనసేన తరఫున గెలిచినప్పటికీ ఫ్యాన్ పార్టీకి ఇన్నాళ్లూ అనుకూలంగా పని చేశానని, అయినప్పటికీ తనకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన మీడియా ఎదుట వాపోయారు.


ఐదేళ్లపాటు కష్టపడి వైసీపీ పెద్దలు చెప్పిన ప్రతి పనినీ చేసినా 2024 ఎన్నికల్లో తనకు రాజోలు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తనకు ఇష్టలేకపోయిన ఎంపీగా నిలబెట్టారని ధ్వజమెత్తారు. రాజోలు నియోజకవర్గంలో "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం ద్వారా ఎంతో కష్టపడ్డానని, అయినా తనకు కాకుండా గొల్లపల్లి సూర్యరావుకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారని రాపాక మండిపడ్డారు. ఈ విషయం తనను ఎంతో కలచివేసినట్లు ఆయన పేర్కొన్నారు.


తాజాగా రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా గొల్లపల్లి సూర్యరావునే మళ్లీ ప్రకటించారని, దీంతో తాను మరింతగా మానసిక కుంగుబాటుకు లోనైనట్లు చెప్పారు. పార్టీలో తనకు ప్రాధాన్యం లేదని, అలాంటి చోట తాను ఉండబోనని వెల్లడించారు. ఏ పార్టీలో చేరుతాననే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, వైసీపీలో మాత్రం ఉండనని తెగేసి చెప్పారు. వేరే పార్టీల నుంచి ఆహ్వానం వస్తే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటానని రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

New Liquor Policy: ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు..

Heavy Rains: రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

AP News: టీడీపీ ఆఫీసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత..

Nara Lokesh: ఇచ్చిన మరో హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

Updated Date - Oct 13 , 2024 | 07:28 PM