Ramanjaneyulu: చివరకు జగన్ దానిని కూడా తాకట్టు పెట్టారు
ABN , Publish Date - Jul 14 , 2024 | 06:18 PM
ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీని కూడా మాజీ సీఎం జగన్ రెడ్డి (Jagan Reddy) తాకట్టు పెట్టారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (Pulaparthi Ramanjaneyulu) విమర్శలు చేశారు.
పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీని కూడా మాజీ సీఎం జగన్ రెడ్డి (Jagan Reddy) తాకట్టు పెట్టారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (Pulaparthi Ramanjaneyulu) విమర్శలు చేశారు. సంక్షేమం ఏదో చేశామని చెప్పుకుంటున్నారని.. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ గతంలో చంద్రబాబు చేసినవేనని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా చేసింది ఏమీ లేదని చెప్పారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.పేరుపాలెం బీచ్ నుంచి తాడేపల్లిగూడెం వరకు ఫోర్ లైన్స్ వేయటానికి ఆలోచన చేస్తున్నామని అన్నారు. తమను ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించింది వారి సమస్యలను పరిష్కరించడానికేనని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు.