MLA Gorantla Butchaiah Chowdary: జగన్ పాలనలో భూ దోపిడిపై విచారణ చేస్తాం.. గోరంట్ల మాస్ వార్నింగ్
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:52 PM
MLA Gorantla Butchaiah Chowdary: అన్ని వ్యవస్థలను వైసీపీ అధినేత జగన్ నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. జగన్ తీరు వల్ల పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పింఛన్లు అందజేశామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

రాజమండ్రి: వైసీపీ తప్పుడు విధానాల వల్ల విద్యుత్ చార్జీలు పెరిగాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. జగన్ హయాంలో నాసిరకం బొగ్గు కొనుగోలు చేయటం వల్ల ఉత్పత్తి తగ్గిపోతే అధిక ధరలకు కరెంట్ కొన్నారని ఆరోపించారు. విద్యుత్ చార్జీలపై వైసీపీ నేతలు ధర్నాలు చేసేందుకు సిగ్గుపడాలని అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లను అధిక రేట్లకు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇవాళ(శనివారం) ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ... జగన్ నియంతలా ఏపీని పరిపాలించారని విమర్శించారు. జగన్ ఐదేళ్లలో అభివృద్ధి పనులు ఏమీ చేయలేదని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కరెంట్ చార్జీలు తగ్గిస్తామని తెలిపారు. జగన్ తీరు వల్ల పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పింఛన్లు అందజేశామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. సోలార్ విద్యుత్ కోసం జగన్ ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో జరిగిన భూముల దోపిడీపై విచారణ జరుగుతుందని అన్నారు. వైసీపీ అక్రమాల వల్లే కూటమి నేతలను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు వెలికి తీస్తాం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు: జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో భూ సర్వే చేపట్టడంతో వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు . ముత్తుకూరులో ఇవాళ(శనివారం) ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వంలో అసైన్డ్ ల్యాండ్స్, బినామీ పట్టాలు, డీకేటీ భూముల్లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి దుర్మార్గాలకు ఆంధ్రప్రదేశ్ నెలవైందని అన్నారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేసుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందని చెప్పారు. భూ కుంభకోణం చేసిన వారంతా జైలుకు పోవాల్సిందేనని హెచ్చరించారు. సర్వేపల్లిలో కూడా భూకుంభకోణం పెద్ద ఎత్తులో జరిగిందని... తప్పకుండా అన్నిటిని బయటకు తీస్తామని : ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: వారిని ఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం
Bhanuprakash: తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం
Hyderabad: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఎపీఎస్‌ఆర్టీసీ.. అక్కడ్నుంచి ఏకంగా..
Read Latest AP News and Telugu News