AP News: జగన్‌పై రాయి దాడి ఘటనలో మరొకరి అరెస్ట్.... ఇదెక్కడి దారుణమంటున్న కుటుంబీకులు
ABN , Publish Date - Apr 17 , 2024 | 01:08 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి ఘటనలో పలువురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుడు, వడ్డెర సంఘం నేత వేముల దుర్గారావును నిన్న (మంగళవారం) రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సింగ్‌నగర్ వంతెన వద్ద ఉండగా దుర్గారావును పోలీసులు తీసుకెళ్లారు.
అమరావతి, ఏప్రిల్ 17: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (CM Jagan Mohan Reddy) జరిగిన గులకరాయి దాడి (Stone Attack) ఘటనలో పలువురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుడు, వడ్డెర సంఘం నేత వేముల దుర్గారావును నిన్న (మంగళవారం) రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సింగ్‌నగర్ వంతెన వద్ద ఉండగా దుర్గారావును పోలీసులు తీసుకెళ్లారు. అయితే దుర్గారావు అరెస్ట్‌పై కుటుంబీకులు, వడ్డెర కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయకులను బలిచేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.
Bhadrachalam: సీతమ్మ మెడలో పుస్తె కట్టిన రామయ్య.. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం కమనీయం
వడ్డెర కాలనీ వాసుల ఆక్రోశం...
గులకరాయి దాడి ఘటనలో నిన్న ఐదుగురు మైనర్లను పోలీసులు తీసుకెళ్లడంతో సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసుల ఆందోళనకు దిగారు. అమాయకులను బలి చేస్తున్నారంటూ ఆక్రోశం వెల్లగక్కారు. వేముల దుర్గారావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘‘మేము ప్రతి రోజూ పనులు చేసుకుని కుటుంబం పోషించుకుంటాం. మాకు ఏ పార్టీ తో సంబంధం లేదు. ఎవరు డబ్బులు ఇచ్చినా ర్యాలీలకు వెళతాం. జగన్ సభకు రెండు వందలు అంటే మా ఆడోళ్లు వెళ్లారు. మగాళ్లకు మూడు వందలు ఇచ్చారు. నిన్న దుర్గారావు ఎవరు అని పోలీసులు ఇంటికి వచ్చారు. వివరాలు ఏమీ చెప్పకుండా తీసుకెళ్లారు. ఇప్పుడు జగన్ పై రాయి వేశారని చెబుతున్నారు. సీఎంపై దాడి చేసే అంత ధైర్యం మా వాడికి లేదు. దుర్గారావుకు చిన్న పిల్లలు, భార్య ఉన్నారు. మా కాయ కష్టంతో బతకడమే మాకు తెలుసు. దుర్గారావుతో సహా మేమంతా వైసీపీ మీటింగ్‌లకు కూడా వెళ్లాం. ఎమ్మెల్సీ రుహుల్లాకు కూడా మేమేంటో తెలుసు. మొన్న ఇఫ్తార్ విందుకు కూడా మాకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు. దుర్గారావుకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత. అమాయకులను బలి చేయవద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.
Ayodhya: అయోధ్య రాముడి నుదట సూర్య తిలకం.. వీక్షించేందుకు తరలివస్తున్న భక్తులు
టీడీపీ ఫిర్యాదు..
మరోవైపు రాయి దాడి ఘటనలో అరెస్ట్ అయిన దుర్గారావు ద్వారా సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోండా ఉమను ఈ కేసులో అక్రమంగా ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఫిర్యాదు చేసింది. బొండా ఉమాపై నెపం మోపేందుకు రాజకీయ కుట్ర జరుగుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర సీఈఓ, డీజీపీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగే విధంగా చూడాలని టీడీపీ నేత కోరారు.
ఇవి కూడా చదవండి..
AP Elections: వైసీపీలో సరికొత్త టెన్షన్.. అభ్యర్థులపై అధిష్టానం ఒత్తిడి..
Atchannaidu: గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ కుట్ర..
మరిన్ని ఏపీ వార్తల కోసం...