AP Politics: రామాంజనేయులుపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి: వర్ల రామయ్య
ABN , Publish Date - Mar 20 , 2024 | 09:14 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలు లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. దళితులను బెదిరించి ఓట్లు దండుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. ప్రత్తిపాడులో వాలంటీర్లతో వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ సమావేశం కావడం ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్దం అని తెలిపారు. ఆ అంశాన్ని మాజీ ఐఏఎస్, దళితుడు రామాంజనేయులు ప్రశ్నిస్తే దాడికి తెగబడ్డారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలు లక్ష్యంగా వైసీపీ (YCP) శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (Varla Ramaiah) మండిపడ్డారు. దళితులను బెదిరించి ఓట్లు దండుకోవాలని వైసీపీ నేతలు (YCP Leaders) చూస్తున్నారని వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు. ప్రత్తిపాడులో వాలంటీర్లతో వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ సమావేశం కావడం ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్దమని తెలిపారు. ఆ అంశాన్ని మాజీ ఐఏఎస్, దళితుడు రామాంజనేయులు ప్రశ్నిస్తే దాడికి తెగబడ్డారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఐఏఎస్ అధికారిపై వైసీపీ శ్రేణులు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేశారని నిలదీశారు. ప్రత్తిపాడులో రామాంజనేయులుపై దాడిచేసిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. వైసీపీ అభ్యర్థితో సమావేశమైన వాలంటీర్లను తక్షణం విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.