Share News

AP Politics: కొల్లి, ధర్మారెడ్డిల సంగతేంటి?

ABN , Publish Date - Apr 11 , 2024 | 08:30 AM

ఒకరు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి, మరొకరు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో ధర్మారెడ్డి. వీరిద్దరూ ‘హద్దులు’ మీరారంటూ విపక్ష బీజేపీ, టీడీపీ సహా పలు పార్టీల నాయకులు కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది...

AP Politics: కొల్లి, ధర్మారెడ్డిల సంగతేంటి?

  • వారిపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై..

  • నివేదిక ఇవ్వండి: ప్రభుత్వానికి ఈసీ ఆదేశం

  • ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేసిన కొల్లి

  • తిరుమలను రాజకీయం చేసిన ధర్మారెడ్డి

  • డిప్యుటేషన్‌ ముగిసినా టీటీడీలోనే..

  • ఎన్నికల సంఘానికి బీజేపీ, టీడీపీల ఫిర్యాదు

  • రాష్ట్ర నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు


అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ఒకరు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి, మరొకరు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో ధర్మారెడ్డి. వీరిద్దరూ ‘హద్దులు’ మీరారంటూ విపక్ష బీజేపీ, టీడీపీ సహా పలు పార్టీల నాయకులు కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి (Central Election Commission) ఫిర్యాదు చేశారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ‘‘కొల్లి రఘురామిరెడ్డి, ధర్మారెడ్డిల సంగతేంటి? వారిపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై నిగ్గుతేల్చి నివేదిక ఇవ్వండి’’ అని ఆదేశించింది. దీంతో ఆ ఇద్దరు అధికారులపై ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీ కొల్లి రఘురామిరెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల పలు ఫిర్యాదులు చేశారు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేశారన్నది ప్రధాన ఫిర్యాదు. వైసీపీ నుంచి రూ.30 కోట్లు ఎన్నికల ఖర్చు కోసం తీసుకున్నాని పురందేశ్వరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనాకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీనిని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఈ నేపథ్యంలో ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

నిబంధనలకు తూట్లు.. పార్టీలకు బాండ్లు


అధర్మంగా ధర్మారెడ్డి!

టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై బీజేపీ, టీడీపీ నేతలు భానుప్రకాశ్‌రెడ్డి, పట్టాభిరామ్‌ 8న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చి ఐదేళ్లుగా టీటీడీలో చక్రం తిప్పుతున్నారని, ‘మూడేళ్ల నిబంధన’ ఆయనకు వర్తింపజేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.1500 కోట్ల అభివృద్థి పనుల వ్యవహారంలో టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డితో కలిసి అయాచిత లబ్ధి పొందేందుకు ధర్మారెడ్డి ప్రణాళిక సిద్థం చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో ఈసీ రాష్ట్ర ప్రభుత్వ వివరణను కోరిం ది. దాని ఆధారంగా ధర్మారెడ్డిని బదిలీ చేసే అవకాశం ఉంది.

Updated Date - Apr 11 , 2024 | 09:13 AM