AP Election 2024: మాచర్లలో భయాందోళనలు సృష్టించిన వైసీపీ: చంద్రబాబు
ABN , Publish Date - May 10 , 2024 | 07:53 PM
మాచర్లలో వైసీపీ పాలనలో ఐదేళ్లు అప్రజాస్వామిక పరిస్థితులతో ప్రజలు భయాందోళనలు చెందారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డిపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చెప్పారు. వాతావరణ పరిస్థితులు కారణంగా ఈరోజు మాచర్ల ప్రజాగళం సభకు రాలేకపోయానని తెలిపారు. ఈమేరకు మాచర్ల సభను ఉద్దేశించి చంద్ర బాబు వీడియో సందేశం విడుదల చేశారు.
పల్నాడు జిల్లా: మాచర్లలో వైసీపీ పాలనలో ఐదేళ్లు అప్రజాస్వామిక పరిస్థితులతో ప్రజలు భయాందోళనలు చెందారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డిపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చెప్పారు. వాతావరణ పరిస్థితులు కారణంగా ఈరోజు మాచర్ల ప్రజాగళం సభకు రాలేకపోయానని తెలిపారు. ఈమేరకు మాచర్ల సభను ఉద్దేశించి చంద్ర బాబు వీడియో సందేశం విడుదల చేశారు.
AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్ ‘వ్యూహం’
నియోజకవర్గంలో వైసీపీని చరమగీతం పాడాలనే కసి ప్రజల్లో ఉందని తెలిపారు. పల్నాడు ప్రజల త్యాగాలు తన మనస్సులో ఎప్పుడు మెదలుతూ ఉంటాయని చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలు చంద్రయ్య, జల్లయ్య వంటి వారి త్యాగాలు మర్చిపోనని అన్నారు. పార్టీని కన్న తల్లి కంటే మిన్నగా కాపాడుకున్నారని ఉద్ఘాటించారు. మాచర్లలో బ్రహ్మారెడ్డి వచ్చాక పరిస్థితి మారిందని వివరించారు.
మాచర్లలో బ్రహ్మారెడ్డి వంద శాతం విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి పనులు చేశారని తెలిపారు. వీరిద్దరిని ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిపించాలని కోరారు. పవన్ కళ్యాణ్ సినీ హీరో మాత్రమే కాదు.. రాజకీయాల్లో కూడా హీరో అని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటు చీలకూడదని పొత్తు పెట్టుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
AP Election 2024 : విజన్ X విధ్వంసం.. చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే
Read Latest AP News And Telugu News