Share News

CM Jagan: కేసరపల్లి నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం.. నేటి షెడ్యూల్ ఇదే..

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:42 AM

Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒకరోజు విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఉదయం కేసరపల్లి క్యాంపు సైట్ నుంచి సీఎం బస్సు యాత్ర మొదలైంది. ఈ సందర్భంగా కేసరపల్లికి భారీగా అభిమానులు చేరుకుని ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అయితే... మొన్న విజయవాడలో దాడి జరిగిన నేపథ్యంలో సీఎం బస్సుయాత్రకు మూడు అంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. కాసేపటికే జగన్ బస్సు యాత్ర గన్నవరంకు చేరుకుంది.

CM Jagan: కేసరపల్లి నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం.. నేటి షెడ్యూల్ ఇదే..
CM Jaganmohan reddy Bus Yatra

కృష్ణా, ఏప్రిల్ 15: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM YS Jaganmohan Reddy) ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర (Memantha Siddham Bus Yatra) ఒకరోజు విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఉదయం కేసరపల్లి క్యాంపు సైట్ నుంచి సీఎం బస్సు యాత్ర మొదలైంది. ఈ సందర్భంగా కేసరపల్లికి భారీగా అభిమానులు చేరుకుని ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అయితే... మొన్న విజయవాడలో దాడి జరిగిన నేపథ్యంలో సీఎం బస్సుయాత్రకు మూడు అంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. కాసేపటికే జగన్ బస్సు యాత్ర గన్నవరంకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్‌కు గన్నవరం వాసులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం గన్నవరంలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.

Road Accident: అనంతపురంలో దారుణం.. కారుతో ఢీకొని 18 కి.మీ. లాక్కెళ్లిన డ్రైవర్


నేటి యాత్ర షెడ్యూల్...

  • ఈరోజు ఉదయం కేసరపల్లి నుంచి బస్సు యాత్ర మొదలు..

  • గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్ , హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, మీదుగా జొన్నపాడు వద్ద భోజన విరామం

  • జొన్నపాడు, జనార్దణపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుని అక్కడ బహిరంగ సభ

  • సభ అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి , గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకొని అక్కడ రాత్రి బస చేయనున్నారు.

Sunitha: వివేక హంతకులెవరు?.. సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్


జగన్‌పై రాళ్ల దాడి..

కాగా.. శనివారం రాత్రి విజయవాడలో జరిగిన ‘మేమంతా సిద్ధం’ రోడ్‌ షోలో ముఖ్యమంత్రి జగన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. సింగ్‌నగర్‌లో యాత్ర సాగుతుండగా ఆగంతకులు ఆయనపైకి రెండు రాళ్లు విసిరారు. దీంతో బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్‌ ఎడమ కంటికి పైభాగాన నుదుటిపై స్వల్ప గాయమైంది. అలాగే ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు కంటి కింద కూడా గాయం అయ్యింది. దాడి జరిగిన వెంటనే జగన్ బస్సులోకి వెళ్లగా.. వైద్యులు ఆయనకు చికిత్స అందజేశారు. ఆపై సీఎం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. వైద్యుల సూచన మేరకు ముఖ్యమంత్రి ఒకరోజు పాటు విశ్రాంతి తీసుకోవడంతో.. మేమంతా సిద్ధం వన్‌డే బ్రేక్ పడింది. తిరిగి ఈరోజు యధావిధిగా జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. అయితే రాళ్ల దాడిపై వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందంతా ప్రతిపక్షాల కుట్రే అంటూ వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి..

AP Elections: జగన్‌పై దాడికి అసలు కారణం అదేనా.. వాళ్లకు ముందే తెలుసా..!

జగన్‌పైకి రాళ్లు!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 15 , 2024 | 05:09 PM