Share News

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు..

ABN , Publish Date - Apr 15 , 2024 | 10:37 AM

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court). లిక్కర్ స్కామ్ కేసులో కవితను మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఈ మూడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో.. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో..

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు..
Delhi Liquor Scam Case

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court). లిక్కర్ స్కామ్ కేసులో కవితను మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఈ మూడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో.. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాదులు, కవిత తరఫున న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని.. విచారణకు ఆమె సహకరించలేదని సీబీఐ ఆరోపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కవితను 9 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది. దీని ప్రకారం.. కవిత ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.


జై తెలంగాణ నినాదంతో..

కాగా, ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది సీబీఐ. కోర్టులోకి వెళ్లే ముందు కవిత జై తెలంగాణ నినాదం చేశారు. వాదనల అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చిన ఆమె.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదని.. బీజేపీ కస్టడీ అని ఆరోపించారు. బయట బీజేపీ వాళ్లు అడగిందే.. లోపల సీబీఐ అడుగుతోందన్నారు. రెండు నెలల నుంచి అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని, కొత్తగా ఏమీ లేదన్నారు కవిత. కాగా, కవిత ఏప్రిల్ 23వ తేదీ వరకు తీహార్ జైల్లో ఉండనున్నారు.

ఇవి కూడా చదవండి:

మరో యాత్రతో ప్రజల్లోకి..!

ఇజ్రాయెల్‌ బ్రహ్మాస్త్రం.. ‘యారో’..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 10:37 AM