AP Elections 2024: ఎన్నికల ముంగిట జగన్‌కు వరుస షాక్‌లు.. ఈసీ కీలక ఆదేశాలు..
ABN , Publish Date - May 05 , 2024 | 08:06 PM
కేంద్ర ఎన్నికల సంఘం సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) తనయుడు.. సజ్జల భార్గవ రెడ్డికి(Sajjala Bhargava Reddy) పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనపై సీఐడీ విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడిపై(Chandrababu Naidu) వైసీపీ(YCP) తప్పుడు ప్రచారం చేస్తోందంటూ..
అమరావతి, మే 05: కేంద్ర ఎన్నికల సంఘం సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) తనయుడు.. సజ్జల భార్గవ రెడ్డికి(Sajjala Bhargava Reddy) పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనపై సీఐడీ విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడిపై(Chandrababu Naidu) వైసీపీ(YCP) తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఎన్నికల సంఘానికి(Election Commission of India) తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదను పరిశీలించిన ఎన్నికల సంఘం.. సజ్జల భార్గవ రెడ్డిపై సీఐడీ విచారణ జరిపించాలని ఆదేశించింది.
ఎన్నికల కోడ్ పేరు చెప్పి.. ఏపీలో ఇంటింటికీ పించన్ల పంపిణీ నిలిపివేశారు. అయితే, ఈ పింఛన్ల పంపిణీ ఆగిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణం అని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలోనే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లను, పింఛన్ లబ్దిదారులను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన తెలుగుదేశం పార్టీ నేతలు.. వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కుట్రతో, విధ్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని సజ్జల భార్గవ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
వర్ల రామయ్య ఫిర్యాదు ఆధారంగా వైసీపీ ఐవిఆర్ఎస్ కాల్స్‌పై సిఐడి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని సిఐడి డిజికి ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఈసీ ఆదేశాలపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.