AP Politics: అప్పుడు కోడికత్తి.. ఇప్పుడు గులకరాయి.. జగన్‌పై జనసేన కార్పొరేటర్ ఫైర్
ABN , Publish Date - Apr 15 , 2024 | 01:49 PM
Andhrapradesh: విజయవాడ సింగ్‌నగర్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి ఘటనపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ స్పందిస్తూ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోడి కత్తి డ్రామాతో జగన్ అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు సింగ్ నగర్‌లో గులకరాయి దాడితో కొత్తనాటకానికి తెరలేపారంటూ విమర్శించారు. జగన్ పర్యటించిన ప్రదేశంలో వీధిలైట్లు కూడా లేనప్పుడు నిఘావర్గాలు ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఒక్క జగన్‌కే చీకట్లో గులకరాయి ఎలా తగిలింది? అంటూ ఎద్దేవా చేశారు. దీనికి బాధ్యత వహించి డీజీపీ తక్షణమే విధుల్లోంచి తప్పుకోవాలన్నారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 15: విజయవాడ (Vijayawada) సింగ్‌నగర్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (CM Jaganmohan Reddy) జరిగిన గులకరాయి ఘటనపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ (JanaSena corporator Murthy Yadav) స్పందిస్తూ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోడి కత్తి డ్రామాతో జగన్ అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు సింగ్ నగర్‌లో గులకరాయి దాడితో కొత్తనాటకానికి తెరలేపారంటూ విమర్శించారు. జగన్ పర్యటించిన ప్రదేశంలో వీధిలైట్లు కూడా లేనప్పుడు నిఘావర్గాలు ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఒక్క జగన్‌కే చీకట్లో గులకరాయి ఎలా తగిలింది? అంటూ ఎద్దేవా చేశారు. దీనికి బాధ్యత వహించి డీజీపీ తక్షణమే విధుల్లోంచి తప్పుకోవాలన్నారు.
Jeevan Reddy: నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు కాంగ్రెస్ సిద్ధం..
పవన్ కల్యాణ్‌పై , చంద్రబాబు నాయుడుపై రాళ్లు వేయించారని మండిపడ్డారు. ఎన్నికల్లో అరాచక శక్తులు అల్లర్లు చేయడానికి సిద్ధపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాటకాలు మానాలని... ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. గులకరాయి దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపినప్పుడు గొడ్డలిని స్వాధీనం చేసుకోకుండా ఏం చేశారని నిలదీశారు. ఎన్నికల్లో మరిన్ని అరాచకాలకు దిగుతారని తెలుస్తోందని కార్పొరేటర్ అన్నారు.
పాపునాయుడిపై చర్యలేవి?
అలాగే.. జీవీఎంసీ యూసీడీ పీడీ పాపునాయుడుపై కూడా మూర్తి యాదవ్ విరుచుకుపడ్డారు. వైసీపీ కోసం పని చేయాలని జీవీఎంసీ యూసీడీపీడీ పాపునాయుడు ఆర్పీలను ప్రలోభపెట్టి వారి నుంచి పత్రాలు రాయించుకోవడం ఎన్నికల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా వైసీపీకి తొత్తులా పనిచేస్తోన్న పాపునాయుడుపై ఎందుకు చర్యలులేవని ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖలో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ మీనాకు సపర్యలు చేసినట్లు ప్రచారం చేసుకోవడమే కారణమని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ మీనాకు నమ్మినబంటునని చెప్పుకుంటున్నాడంటే ఎంతటికి బరితెగించాడో అర్ధమవుతోందని మండిపడ్డారు.
Andhrapradesh: అన్నింటిలోనూ అధమస్థానంలో ఏపీ.. ఆర్థికవేత్త చిన్నయసూరి వ్యాఖ్యలు
ఏప్రిల్ 7కు పాపునాయుడు డిప్యూటేషన్ కాలం పూర్తయినా ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని.... ఎక్సైజ్ డిపార్ట్‌మెంటుకు ఎందుకు సరెండర్ అవ్వలేదని నిలదీశారు. మెప్మా ఎమ్డీ విజయలక్ష్మి ఆశీస్సులతో కొనసాగుతున్నారనుకోవాలా అని ప్రశ్నించారు. మంత్రి బొత్స సామాజిక వర్గానికి చెందిన వారనా చర్యలు తీసుకోకపోడానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపునాయుడును ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. గతంలో పాపునాయుడు అవినీతి అక్రమాలపై వేసిన కమిటి రిపోర్ట్ ఏమైందన్నారు. పాపునాయుడు చేసిన అక్రమాలకు ఆర్పీలను బలిచేస్తున్నారని విమర్శించారు. జిల్లా ఎన్నికల అధికారికి, చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు , కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూటమి తరపున ఫిర్యాదు చేస్తామని మూర్తి యాదవ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి...
Gorantla Butchaiah Chowdary: కరెంట్ తీయటం జగన్ కుట్ర కాదా?
BJP: ఏపీలో వింత వింత సంఘటనలు: భానుప్రకాశ్ రెడ్డి
మరిన్ని ఏపీ వార్తల కోసం...