Share News

Elections 2024: ఓటరు స్లిప్పు లేదా.. ఈ సేవలు మీకోసమే..

ABN , Publish Date - May 12 , 2024 | 06:48 PM

దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు పేరు మీద ఎన్నికల సంఘం ఓటరు స్లిప్ ముద్రిస్తుంది. పోలింగ్ సమయానికి ఓ వారం రోజుల ముందే బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వో)లద్వారా ఓటర్లు స్లిప్‌లు పంపిణీ చేస్తారు. ఈ ఓటరు స్లిప్ ఉండటం ద్వారా ఓటరు ఏ బూత్‌లో ఓటు వేయాలో.. ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్య ఎంత అనేది స్పష్టంగా ఉంటుంది. దీంతో పోలింగ్ స్పీడ్‌గా జరుగుతుంది.

Elections 2024: ఓటరు స్లిప్పు లేదా.. ఈ సేవలు మీకోసమే..
Voters

దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు పేరు మీద ఎన్నికల సంఘం ఓటరు స్లిప్ ముద్రిస్తుంది. పోలింగ్ సమయానికి ఓ వారం రోజుల ముందే బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వో)లద్వారా ఓటర్లు స్లిప్‌లు పంపిణీ చేస్తారు. ఈ ఓటరు స్లిప్ ఉండటం ద్వారా ఓటరు ఏ బూత్‌లో ఓటు వేయాలో.. ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్య ఎంత అనేది స్పష్టంగా ఉంటుంది. దీంతో పోలింగ్ స్పీడ్‌గా జరుగుతుంది. ఓటరు స్లిప్ ఉన్నప్పటికీ ఓటు వేయడానికి వెళ్లినప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరి. ఓటరు కార్డు లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఓటరు స్లిప్‌పై కేవలం ఓటరు సమాచారం మాత్రమే ఉంటుంది. ఇది గుర్తింపు కార్డుగా పనిచేయదు. అయితే ఓటు వేయాలంటే ఓటరు స్లిప్ తప్పనిసరని చాలామంది అనుకుంటారు. ఓటరు స్లిప్ లేదని కొంతమంది ఓటు వేయడానికి వెళ్లరు. కానీ ఓటరు స్లిప్పు లేకపోయినా ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఓటర్ల జాబితాలో పేరుంటే చాలు. ఓటర్ స్లిప్ వల్ల ఓటు వేసే వ్యక్తిని జాబితాలో గుర్తించడం సులభతరమవుతుంది.

Vijayawada: ఎన్నికలకు సర్వం సిద్ధం.. సిరా విషయంలో కలెక్టర్ క్లారిటీ


ఓటరు స్లిప్‌తో ఉపయోగాలు..

ఒక పోలింగ్ బూత్‌లో వెయ్యి నుంచి రెండు వేల మంది వరకు ఓటర్లు ఉంటారు. వాళ్లంతా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటరు స్లిప్‌ ఉంటే అందులో మనం ఏ పోలింగ్ బూత్‌లో ఓటు వేయాలి. బూత్ అడ్రస్‌ ఉంటుంది. నేరుగా ఆ నెంబర్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసి రావచ్చు. స్లిప్‌ లేకపోతే ఓటు ఏ బూత్‌లో ఓటు ఉందో వెతుక్కోవాల్సి ఉంటుంది. పోలింగ్ వేగంగా జరిగేందుకు వీలుగా ఓటరు స్లిప్‌లు ముద్రించి ఎన్నికల సంఘం ప్రతి ఓటరుకు పంపిణీ చేస్తుంది.


ఓటరు స్లిప్ అందకపోతే ఏం చేయాలి

ఓటరు స్లిప్‌లు ఎవరికైనా అందకపోతే పోలింగ్ బూత్ బయట వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల తరపున టెంట్స్ వేసి ఓటర్లుకు సహాయపడేందుకు సహాయ కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. ఆ కేంద్రానికి వెళ్లి మన పేరు చెబితే ఓటరు జాబితాలో ఉన్న సీరియల్ నెంబర్ పేపర్‌పై రాసి ఇస్తారు. అది తీసుకుని పోలింగ్ బూత్‌ లోపలకి వెళ్తే వేగంగా మన ఓటు వేసి రావచ్చు.


AP Elections2024: చంద్రబాబు ఓటు వేసేది ఎక్కడంటే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News And Telugu News

Updated Date - May 12 , 2024 | 06:54 PM