ABN BIG Debate: తెగించే వచ్చా.. ఆ పని చేస్తే చెయ్యి తీసేస్తా.. బిగ్ డిబేట్‌లో పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Apr 24 , 2024 | 06:57 PM
ఏపీలో వైసీపీ అరాచక పాలన, తాజా రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో మాట్లాడుతూ.. ఈ భూమిపై ఉన్న ప్రేమతోనే అమెరికా సిటిజన్ షిప్ తీసుకోలేదన్నారు. తాను టూరిస్ట్ వీసాలపై రాలేదన్నారు. తనకు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు.
ఏపీలో వైసీపీ అరాచక పాలన, తాజా రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో (BIG Debate) మాట్లాడుతూ.. ఈ భూమిపై ఉన్న ప్రేమతోనే అమెరికా సిటిజన్ షిప్ తీసుకోలేదన్నారు. తాను టూరిస్ట్ వీసాలపై రాలేదన్నారు. తనకు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు. తాను ఎవరి బెదిరింపులకు బెదిరేది లేదన్నారు. తెగించే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఇప్పటివరకు అమెరికాలో ఎంతోమందికి సేవ చేశానని, సొంత గడ్డకు చేయాల్సినంత స్థాయిలో సేవ చేయలేకపోవడంతో.. పూర్తిస్థాయిలో సేవచేసేందుకు స్వదేశానికి వచ్చినట్లు తెలిపారు.
AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ
వైసీపీ అరాచకాలను ఎదిరించే తెగువ తనకు ఉందన్నారు. అక్రమ కేసులు పెట్టినా ఎదిరించగల శక్తి ఆ భగవంతుడు ఇచ్చారన్నారు. అక్రమ కేసులు పెట్టినా పోరాడేందుకు వ్యవస్థలు ఉన్నాయన్నారు. కేసులు పెట్టి ఎన్ని రోజులు నిర్భందించగలరని ప్రశ్నించారు. ఆరు నెలలో, ఏడాదో జైల్లో పెడతారని.. అలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును ఇబ్బంది పెట్టినట్లుగా ఇబ్బందిపెట్టి, భౌతికదాడి చేస్తే ఏం చేయగలరని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించగా.. కొట్టడం అనేది చట్టానికి వ్యతిరేకమని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి తనను కొట్టినవాడి చెయ్యిని తీసేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను జైల్లో పెడితే మరింత ఎక్కువ పోరాడతానన్నారు. తనకు పుస్తకాలు రాసే అలవాటు ఉందని, జైల్లో పేపర్లు, పెన్నులు ఇస్తారని.. పుస్తకాలు రాస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తానన్నారు.
తాను చాలా కష్టపడి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించానని పెమ్మ సాని చంద్రశేఖర్ తెలిపారు. సీఎం జగన్‌లా తాను డబ్బులు సంపాదించలేదని, తాను కష్టంతో ఈ స్థాయికి వచ్చానన్నారు. ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, ఆశయంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపారు. తనకు ఒక విజన్ ఉందని.. సమయం వచ్చినప్పుడు తన లక్ష్యాన్ని బయటపెడతానన్నారు. గుంటూరు ఎంపీగా నియోజకవర్గం అభివృద్ధికి ఏం చేయాలో తనవద్ద ఓ ప్రణాళిక ఉందని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే రాజకీయనాయకులను కట్టడి చేసేందుకు పొలిటికల్ సెన్సార్ బోర్డు తీసుకురావాలనేది తన లక్ష్యమన్నారు.
Yarlagadda Venkatarao: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest Andhra Pradesh News And Telugu News