AP Election 2024: రాజమండ్రిలో ఎన్డీఏ ఉమ్మడి సభ.. పాల్గొన్న ప్రధాని మోదీ
ABN, Publish Date - May 06 , 2024 | 04:17 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు (AP Election 2024) ఈనెల 13వ తేదీన జరుగుతుండటంతో తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్డీఏ కూటమి ఉమ్మడిగా రాజమండ్రిలోని వేమగిరిలో ‘ప్రజాగళం’ వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్, మూడు పార్టీల్లోని కీలక నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
రాజమండ్రి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు (AP Election 2024) ఈనెల 13వ తేదీన జరుగుతుండటంతో తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్డీఏ కూటమి ఉమ్మడిగా రాజమండ్రిలోని వేమగిరిలో ‘ప్రజాగళం’ వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్, మూడు పార్టీల్లోని కీలక నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
వేదికపై వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ ముఖ్యనేతలు, టీడీపీ నేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) కూడా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఈ సభలో మోదీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఒకరినొకరు అలింగనం చేసుకుని ముచ్చటించుకున్నారు. వేదికపై వచ్చిన ప్రధానికి జనసేనాని శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం మోదీ కాళ్లకు పవన్ నమస్కరించబోగా అందుకు ఆయన వద్దని నిరాకరించారు. అయితే ఈ సీన్ చూసిన ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌రెడ్డిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ పవర్‌ఫుల్ ప్రసంగాన్ని ఏబీఎన్- ఆంధ్రజ్యోతిలో వీక్షించండి.
Updated at - May 06 , 2024 | 04:31 PM