AP Elections: చంద్రగిరి ఎన్నికల అధికారిని మార్చాల్సిందే: పులివర్తి నాని
ABN , Publish Date - May 16 , 2024 | 12:08 PM
Andhrapradesh: చంద్రగిరి ఎన్నికల అధికారి నిషాంత్ రెడ్డిని మార్చకపోతే కౌంటింగ్లో అక్రమాలు జరుగుతాయని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వెనుక దారి చెవిరెడ్డి సొంత ఊరు తుమ్మలగుంటకు వెళుతుందన్నారు. అలా వెనుక ఒక గేట్ ఉందని.. దాని ద్వారా అక్రమంగా లోపలికి చొరబడవచ్చన్నారు.
తిరుపతి, మే 16: చంద్రగిరి (Chandragiri) ఎన్నికల అధికారి నిషాంత్ రెడ్డిని (Chandragiri Election officer Nishanth Reddy) మార్చకపోతే కౌంటింగ్లో అక్రమాలు జరుగుతాయని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని (TDP Candidate Pulivarthi Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వెనుక దారి చెవిరెడ్డి సొంత ఊరు తుమ్మలగుంటకు వెళుతుందన్నారు. అలా వెనుక ఒక గేట్ ఉందని.. దాని ద్వారా అక్రమంగా లోపలికి చొరబడవచ్చన్నారు.
Chandrababu Naidu: మారిన చంద్రబాబును చూస్తారు
ఆ విషయం చంద్రగిరి ఎన్నికల అధికారి నిశాంత్ రెడ్డికి చెప్పినా వ్యంగ్యంగా నవ్వి ఊరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskarreddy) కుమారుడు యదేచ్చగా బయట తిరుగుతున్నారు’’ అని మండిపడ్డారు. ఎన్నికల అధికారి నిశాంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్, ఏపీ చీఫ్ సెక్రటరీతో జరుగుతున్న మీటింగ్లో చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు పులివర్తి నాని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest AP News AND Telugu News