AP Election 2024: వలంటీర్లకు ఆ బాధ్యతలు అప్పగించొద్దు.. సీఈఓ మీనాకు కూటమి నేతల వినతి
ABN , Publish Date - Apr 23 , 2024 | 08:30 PM
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు ఎన్నికల సంఘాని (Election Commission) కి ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిశారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు ఎన్నికల సంఘాని (Election Commission) కి ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిశారు. ఈ సందర్భంగా మీనాకు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. సామాజిక భద్రత పెన్షన్ లు వలంటీర్ల ద్వారా ఇవ్వవద్దని గతంలో ఈసీ చెప్పిందని... దీన్ని సాకుగా చూపి 31 మంది ప్రాణాలను ఈ ప్రభుత్వం బలి తీసుకుందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) చెప్పారు.
Pawan Kalyan Properties: పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన ఎంతో తెలుసా..!
వచ్చే నెలలో కూడా వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అందుకే మరోసారి10 రోజులు ముందు వచ్చామని ఈసీఐకి లేఖ రాయాలని కోరామన్నారు. మరోసారి సీఎస్ వృద్ధులను హత్య చేసే నిర్ణయం తీసుకోకుండా అడ్డుకోవాలని కోరామన్నారు. ఈ విషయంలో వైసీపీ నేత సజ్జల భార్గవ రెడ్డి జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. కడపకు చెందిన కృష్ణా రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం వ్యక్తిగా మీడియాలో మాట్లాడించి జనాన్ని నమ్మిస్తున్నారని ధ్వజమెత్తారు.
అతను అసలు తెలుగుదేశం వ్యక్తి కాదనిఫిర్యాదు చేశామన్నారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇస్తామని సీఈఓ మీనా చెప్పారని వివరించారు. వలంటీర్లు రాజీనామా చేశాక ఏజెంట్‌లుగా కూర్చోవడానికి వీలు లేదని కోరామన్నారు. నెల్లూరులో మంత్రి కాకానీ గోవర్థన్ రెడ్డి మద్యం డంప్ దొరికిందన్నారు. గత ఎన్నికల్లో దొంగ సారా కేస్ కూడా ఆయనపై ఉందని తెలిపారు. ఎన్ని తప్పులు చేసి అయిన అధికారం లోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు. కుక్కతోక వంకర అన్నట్టు వైసీపీ నేతలు, వారి అధినేత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని జనసేన ఏపీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ రావు అన్నారు.
AP Elections: జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?
పురంధేశ్వరిని అవమానిస్తున్న జగన్: విల్సన్
జగన్ అలానే మాట్లాడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి విల్సన్ అన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తారని జగన్ చెబుతున్నారని అన్నారు. ఆమెను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో కూడా పురంధేశ్వరి బీజేపీ నుంచి పోటీ చేశారని గుర్తుచేశారు. పురంధేశ్వరినీ తిట్టడం అంటే నేరుగా నరేంద్ర మోదీనీ, అమిత్ షాను తిట్టడమేనని విల్సన్ మండిపడ్డారు.
Pawan Kalyan: నామినేషన్ అనంతరం జనసేనాని కీలక వ్యాఖ్యలు
Read Latest Andhra pradesh News or Telugu News