Share News

AP Elections: శ్రీకాకుళం జిల్లాలో సీన్ రివర్స్.. ఓటర్ల మొగ్గు ఎవరివైపు అంటే..!

ABN , Publish Date - Apr 26 , 2024 | 09:28 PM

ఏపీలో అధికారమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓవైపు.. వైసీపీ మరోవైపు ఎన్నికల వ్యూహాలు రచించి ముందుకెళ్తున్నాయి. ఇరు పక్షాలు ప్రతి సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో సంచలన విజయం సాధించగా.. అలాంటి విజయాన్ని సాధించాలని ఎన్డీయే కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. వైసీపీ మాత్రం వైనాట్ 175 అంటూనే.. మెజార్టీ సీట్లలో అధికారమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో గెలవడం 2019లో గెలిచినంత ఈజీ కాదనే అభిప్రాయానికి వైసీపీ నాయకులు వచ్చినట్లు తెలుస్తోంది.

AP Elections: శ్రీకాకుళం జిల్లాలో సీన్ రివర్స్.. ఓటర్ల మొగ్గు ఎవరివైపు అంటే..!
YSRCP

ఏపీలో అధికారమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓవైపు.. వైసీపీ మరోవైపు ఎన్నికల వ్యూహాలు రచించి ముందుకెళ్తున్నాయి. ఇరు పక్షాలు ప్రతి సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో సంచలన విజయం సాధించగా.. అలాంటి విజయాన్ని సాధించాలని ఎన్డీయే కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. వైసీపీ మాత్రం వైనాట్ 175 అంటూనే.. మెజార్టీ సీట్లలో అధికారమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో గెలవడం 2019లో గెలిచినంత ఈజీ కాదనే అభిప్రాయానికి వైసీపీ నాయకులు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉండటంతో.. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన సీట్లలో కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పలేని పరిస్థితి వైసీపీ నాయకుల్లో కనిపిస్తోందనే ప్రచారం జరగుతోంది. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత కూడా రాష్ట్రంలె వైసీపీకి సానుకూల పరిస్థితులు లేవనే చర్చ సాగుతోంది.


ముఖ్యంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడంతో పాటు.. సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను జగన్ మార్చారు. ఇలా చేయడం ద్వారా అభ్యర్థిపై వ్యతిరేకతపోయి.. పార్టీపై ఇష్టంతో వైసీపీకే ఓటు వేస్తారని జగన్ చేసిన ఆలోచన బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపై వ్యతిరేకత కంటే జగన్‌పై కూడా ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో చాలా జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం గత ఎన్నికల పరిస్థితులు లేనట్లు కనిపిస్తోంది.


AP Election 2024: చంద్రబాబు భార్య భువనేశ్వరి టార్గెట్‌గా ‘డీప్ ఫేక్’ ప్రచారం.. విషయం ఏంటంటే?

శ్రీకాకుళంలో సీన్ రివర్స్..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. శ్రీకాకుళం లోక్‌సభ స్థానాన్ని టీడీపీ గెలుచుకున్నప్పటికీ.. జిల్లాలో అత్యధిక సీట్లలో వైసీపీ విజయం సాధించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది ఎమ్మెల్యే సీట్లు ఉండగా గత ఎన్నికల్లో 8 చోట్ల వైసీపీ గెలవగా.. టెక్కలి, ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి శ్రీకాకుళం జిల్లాలో అనుకూల పరిస్థితులు లేనట్లు తెలుస్తోంది. ఒకట్రెండు నియోజకవర్గాలు మినహా మిగతాచోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం తమ నియోజకవర్గాల్లో గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారట. శ్రీకాకుళం నియోజకవర్గంలో మాత్రం మంత్రి దర్మాన ప్రసాదరావు, టీడీపీ అభ్యర్థి శంకర్ రావు మధ్య గట్టిపోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరూ గెలిచినా తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


తీవ్ర వ్యతిరేకత..

శ్రీకాకుళం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి లేకపోవడం మరోవైపు గ్రామాల్లో రహదారులు అధ్వానస్థితిలో ఉండటంతో స్థానిక ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తితో ఉండటం ఈ ఎన్నికల్లో వైసీపీకి మైనస్‌గా భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కలిసిరావడంతో పాటు.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టడంతో ఎన్డీయేకు ఈ జిల్లాలో అనుకూల వాతావరణం ఉందనే ప్రచారం జరగుతోంది. 2019 ఫలితాలు రివర్స్ అవుతాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అసలు ఫలితాలు ఎలా ఉంటాయనేది జూన్4న తేలనుంది.


AP Elections 2024: రాపాక నమ్మించి ద్రోహం చేశారు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 26 , 2024 | 09:28 PM