Share News

CM Chandrababu: పోలీసులు అలా చేయొద్దు.. సీఎం చంద్రబాబు వార్నింగ్

ABN , Publish Date - Jun 15 , 2024 | 05:47 PM

తెలుగుదేశం పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి ఈరోజు(శనివారం)ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Nara Chandrababu Naidu) వచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసేందుకు టీడీపీ కార్యాలయానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

CM Chandrababu: పోలీసులు అలా చేయొద్దు.. సీఎం చంద్రబాబు వార్నింగ్
CM Nara Chandrababu Naidu

అమరావతి: తెలుగుదేశం పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి ఈరోజు(శనివారం)ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Nara Chandrababu Naidu) వచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసేందుకు టీడీపీ కార్యాలయానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తుండటంతో పార్టీ కార్యాలయంలో పోలీసులు ఇనుప గ్రిల్స్‌తో బార్కేడింగ్ ఏర్పాటు చేశారు.


బార్కేడింగ్ చూసి పాత ప్రభుత్వ విధాన హ్యాంగ్ ఓవర్ వీడాలంటూ ఏపీ పోలీసులను సీఎం చంద్రబాబు గట్టిగా మందలించారు. పార్టీ కార్యాలయంలో బార్కేడింగ్ ఏర్పాటు చేయటంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు తన కార్యకర్తలను తాను కలుస్తూ వచ్చానని, ఎప్పుడూ లేని వ్యవస్థ ఇప్పుడెందుకు పెట్టారని చంద్రబాబు ప్రశ్నించారు.


పార్టీ శ్రేణులకు తనకు గ్యాప్ తెచ్చే చర్యలు ఉపేక్షించబోనని పోలీసులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లూ పోలీసుల భద్రతా సాయంతోనే పార్టీ కార్యాలయం నడపలేదనే విషయాన్ని గుర్తించాలని పోలీసులపై సీరియస్ అయ్యారు. శ్రేణుల తాకిడి ఎక్కువ ఉంటే ఓ క్రమపద్ధతిలో వారిని లైనప్ చేయాలి తప్ప మరోసారి బార్కేడింగ్ లాంటి వ్యవస్థ కనిపించకూడదని పోలీసులకు చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu: ప్రజావేదికను అలానే ఉంచుతాం.. ఎందుకంటే..?

Pawan Kalyan: అడవుల వినాశనానికి పాల్పడితే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే..: పవన్ కళ్యాణ్

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

AP Politics: ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటారా.. అహంకారంతో ముందుకెళ్తారా..!

AP Politics: పాలనలో సంస్కరణలకు శ్రీకారం.. గతానికి.. ప్రస్తుతానికి స్పష్టమైన తేడా..

Actor Suman: కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 05:52 PM