Share News

Home Minister Anitha: వారిపై చర్యలు తప్పవు.. హోంమంత్రి అనిత మాస్ వార్నింగ్

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:04 PM

వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని హోంమంత్రి వంగలపూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలు గాడి తప్పాయని వాటిని గాడిలో పెడుతున్నామని తెలిపారు. ఐదేళ్లలో జరిగిన దాడులు, అత్యాచారాలు, హత్యలపై జగన్ ఏం సమాధానం చెబుతారని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు.

Home Minister Anitha: వారిపై చర్యలు తప్పవు.. హోంమంత్రి అనిత మాస్ వార్నింగ్

అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పిన వ్యవస్థలను తిరిగి గాడిలోకి తీసుకువస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వైసీపీ నాయకులకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. ప్రజలకే తాము జవాబు దారితనంగా ఉంటామని అన్నారు. జగన్ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఏపీలో ఎక్కడ కూడా సీ.సీ కెమెరాలు పని చేయడం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు..


ఇవాళ(మంగళవారం) టీడీపీ కార్యాయలంలో హోం మంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ... పోలీసు వ్యవస్థనును గాడిలో పెట్టడానికి వందల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గంజాయి పండించి వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు చేశారు. ఐదేళ్లలో జరిగిన దాడులు, అత్యాచారాలు, హత్యలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్‌కు అస్సలు స్పెషల్ కోర్టు అంటే తెలుసా అని ప్రశ్నించారు. గతంలో నేరం జరిగితే 6 నెలలు దాటినా నిందితులు దొరికేవారు కాదని అన్నారు. ఇప్పుడు ఘటన జరిగిన 24 గంటల్లో నిందితులను పట్టుకుంటున్నామని తెలిపారు. గతంలో మహిళపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ఎందుకు పరామర్శించలేదని హోం మంత్రి వంగలపూడి అనిత అడిగారు.


సహనా విషయంలో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు: ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు

nakka-anand-babu.jpg

గుంటూరు జిల్లా: వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. గుంటూరులోని జీజీహెచ్‌లో బ్రెయిన్ డెడ్ అయిన తెనాలి యువతి సహన కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు ఇవాళ(మంగళవారం) పరామర్శించారు. తెనాలిలో 2 రోజుల క్రితం ప్రమాదానికి గురైన సహనాని పరామర్శించామని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు.


వైసీపీ నేతలు ఈ విషయంపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు, మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరుకు రేపు రావడం అంటే నవ్వొస్తుందని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన దాడులు, హత్యలు జగన్ మరచిపోయారేమో అనిపిస్తోందని విమర్శించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు వైద్యులకు సూచించారని అన్నారు. సహనాకి అన్నిరకాల సహాయక వనరులు సత్వరమే అందిస్తామని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు భరోసా కల్పించారు,


నేరస్తులుపై కఠిన చర్యలు: ఆలపాటి రాజా

Alapati-rajendra-prasad.jpg

సహనా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. సహనా కోసం ప్రభుత్వ వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సహనా విషయంలో వైసీపీ రాజకీయ రంగు పులమడం సిగ్గుచేటు అన్నారు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆలపాటి రాజా మండిపడ్డారు.


బాధితులకు సహాయం అందడం లేదని వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.. రాష్ట్రంలో జగన్ రెడ్డి విద్వేషాలు సృష్టించాలని చూస్తే చంద్రబాబు చూస్తూ కూర్చోరని హెచ్చరించారు, జగన్ రెడ్డి గుంటూరు పర్యటన చేస్తే ఏమైనా భూమి బద్దలవుతుందా అని నిలదీశారు. సహనా విషయంలో నేరస్తులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సహనా కుటుంబ సభ్యులకు టీడీపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆలపాటి రాజా హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Nara Lokesh: మెటాతో ఎంవోయూ ఒక మైలురాయి

AP Ministers: మూడు రోజులుగా ఢిల్లీలోనే ఏపీ మంత్రులు.. ఎందుకంటే

Gottipati Ravikumar: ఏ సీఎం చేయని పనులు జగన్ చేశారు.. మంత్రి గొట్టిపాటి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2024 | 06:01 PM