Lokesh: మమ్మల్ని మన్నించండి కామ్రేడ్.. మంత్రి లోకేష్ సంచలన ట్వీట్
ABN , Publish Date - Aug 01 , 2024 | 09:54 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) గురువారం నాడు మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన పట్ల మన్నించాల్సిందిగా ట్విట్టర్(X)లో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సంచలన ట్వీట్ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) గురువారం నాడు మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన పట్ల మన్నించాల్సిందిగా ట్విట్టర్(X)లో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సంచలన ట్వీట్ చేశారు. తమను మన్నించండి కామ్రేడ్ అంటూ లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ట్వీట్‌ను ఏపీ పోలీస్ 100కు మంత్రి నారా లోకేష్ ట్యాగ్ చేశారు. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు తమ కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. ‘‘గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాను’’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ALSO Read: Madanapalle Incident: సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు
పింఛన్ల పంపిణీపై లోకేష్ కీలక వ్యాఖ్యలు
అంతకు ముందు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జరుగుతోంది. వేకువజాము నుంచే ఎమ్మెల్యేలు, అధికారులు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీపై విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఒకటో తేదీ తెల్లవారి ఆరు గంటలకే పెంచిన పింఛను రూ.4000 ఇంటి వద్దే అందుకున్న అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు. పింఛన్లు అందుకున్న ఒంటరి మహిళలు, దివ్యాంగులు చెబుతున్న కృతజ్ఞతలే మాకు ఆశీస్సులు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకున్న లక్షలాదిమంది వ్యక్తం చేసిన ఆనందమే కూటమి ప్రభుత్వానికి అందిన వెలకట్టలేని బహుమానం’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
ALSO Read: ChandraBabu Govt: ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై వేటు!
మడకశిరలో సీఎం చంద్రబాబు పర్యటన
‘ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం’లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో ఉన్న గుండుమల గ్రామానికి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. గుండుమల గ్రామంలో లబ్దిదారులకు ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. గుండుమల గ్రామానికి చెందిన రామన్నకు ముఖ్యమంత్రి పెన్షన్ పంపిణీ చేశారు. రామన్న కుటుంబ సభ్యులతో ఆయన ముచ్చటించారు.
గ్రామంలో కలియ తిరిగిన చంద్రబాబు..
పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం వెళ్లిన సీఎం చంద్రబాబు గుండుమల గ్రామమంతా కలియతిరిగారు. ‘ఏమమ్మా బాగున్నారా’ అంటూ మహిళలను ఆప్యాయంగా పలకరించారు. మల్బరీ రైతు రంగనాథ్ తోటతో పాటు మల్బరీ పంటను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మాట్లాడిన రైతు రంగనాథ్.. పట్టు రైతులను ఆదుకోవాలని సీఎంని కోరారు. ప్రోత్సాహకాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం పట్టు రైతులను ఎంత మాత్రం ఆదుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం కంపు కంపు చేశారాంటూ మండిపడ్డారు. పట్టు రైతులను ఆదుకునేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vundavalli Sridevi: కులాల మధ్య చిచ్చు పెట్టి కుల రాజకీయం చేసిన వ్యక్తి జగన్..
Lokesh: వారి ఆనందమే కూటమి సర్కార్‌కు వెలకట్టలేని బహుమానం
Mandakrishna: ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఆనాడు కన్నీళ్లతో చెప్పా...
MLA Kanna: అన్న క్యాంటీన్ పనులను పరిశీలించిన కన్నా లక్ష్మీనారాయణ
Read Latest AP News And Telugu News