Share News

Pemmasani Chandra Sekhar: అమరావతిపై జగన్ కుట్ర.. పెమ్మసాని చంద్రశేఖర్ విసుర్లు

ABN , Publish Date - Dec 24 , 2024 | 08:30 PM

Pemmasani Chandra Sekhar :అమరావతిని జగన్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని ద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో రోడ్లనిర్మాణ పనులు మూలన పడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

Pemmasani Chandra Sekhar: అమరావతిపై జగన్ కుట్ర.. పెమ్మసాని చంద్రశేఖర్ విసుర్లు
Pemmasani Chandra Sekhar

గుంటూరు జిల్లా: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసమర్థతతో రాజధాని ప్రాంతం అమరావతి నాశనమైందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. అమరావతిలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇవాళ(మంగళవారం) పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ... అమరావతిపై జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ కుమార్‌తో కలసి సీడ్ యాక్సెస్ రోడ్డు, బైపాస్ రోడ్డు పనులను పరిశీలించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో రోడ్లనిర్మాణ పనులు మూలన పడ్డాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.


ఢిల్లీలో మంత్రి నారాయణ పర్యటన

Narayana.jpg

ఢిల్లీ: ఢిల్లీలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇవాళ(మంగళవారం) పర్యటించారు. హడ్కో సీఈవో సంజయ్ కుల్ శ్రేష్ఠ, జిందాల్ సా చైర్మన్ పీఆర్ జిందాల్‌తో భేటీ అయ్యారు. అమరావతికి రుణ సమీకరణ ప్రక్రియపై హడ్కో చైర్మన్ తో చర్చించారు. ఇప్పటికే రాజధాని కోసం రూ. 11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ల ఏర్పాటుపై పృథ్వీరాజ్ జిందాల్‌తో నారాయణ మాట్లాడారు. ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నంలో రెండు ప్లాంట్‌లను జిందాల్ సంస్థ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. మరిన్ని ప్లాంట్‌ల ఏర్పాటుపై పీఆర్ జిందాల్‌తో చర్చలు జరిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు.


యూరియా కొరత సమస్యను పరిష్కరించాలి: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

somireddy.jpg

నెల్లూరు : ప్రభుత్వం దృష్టికి యూరియా కొరత సమస్యను తీసుకెళ్లానని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడును కోరానని తెలిపారు. కనీసం 15 వేల టన్నుల ఎరువులు అవసరం ఉందని, వెంటనే సరఫరా అయ్యేలా చూడాలని అన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు, కమిషనర్ ఢిల్లీరావు..వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 08:46 PM