Share News

Pemmasani: వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసింది

ABN , Publish Date - Jun 23 , 2024 | 03:03 PM

వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసి, ఖజానాను ఖాళీ చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సమీక్ష చేసినట్లు తెలిపారు.

Pemmasani: వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసింది
Pemmasani Chandra Sekhar

గుంటూరు జిల్లా: వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసి, ఖజానాను ఖాళీ చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సమీక్ష చేసినట్లు తెలిపారు. తాగునీరు సరఫరా, అండర్ గ్రైండ్ డ్రైనేజ్, ఇతర పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని చెప్పారు. నిధులు లేకపోవడంతో తాగునీరు, అండర్ డ్రైనేజ్ పనులు అంసపూర్తిగా నిలిచిపోయాయని అన్నారు.


నగర వాసులకు అత్యవసరమైన మౌలిక వసతులు కల్పనకు కూడా నిధులు లేని పరిస్థితి ఉందన్నారు. వీలైనంత త్వరగా గుంటూరు నగరంలో తాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. నిధులు సమీకరించేందుకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టామని తెలిపారు. అధికారుల సహకారంతో అర్ధాంతరంగా నిలిచిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతివారం లేకుంటే రెండు వారాలకు ఒకసారి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 03:04 PM