Share News

Tirumala Laddu: ఏపీ హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం..

ABN , Publish Date - Sep 20 , 2024 | 12:05 PM

శ్రీవారి లడ్డూ వ్యవహారంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దుష్ర్పచారం జరుగుతోందంటూ సీనియర్ కౌన్సిల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Tirumala Laddu: ఏపీ హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం..

అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం హైకోర్టుకు (High Court) చేరింది. శ్రీవారి లడ్డూ వ్యవహారంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan mohan Reddy)పై దుష్ర్పచారం జరుగుతోందంటూ హైకోర్టును ఏపీ మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆశ్రయించారు. ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు, చేప నూనె వాడారంటూ వైఎస్ జగన్‌పై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపేలా ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. దీనిపై వెంటనే కమిటీ వేసి విచారించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అయితే స్పందించిన హైకోర్టు ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని, వచ్చే బుధవారం విచారణ చేపడతామని తెలిపింది.


జగన్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు..

మరోవైపు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై కేంద్ర హోంశాఖకు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు, చేప నూనె వాడి జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ అధినేత తన చర్యలతో హిందువుల ఆత్మను హత్య చేశారని, వారి నమ్మకాలు, విశ్వాసాలను, తిరుమల ఆలయం పవిత్రతను ఘోరంగా మంటగలిపారని అన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖతోపాటు ఏపీ, ఉత్తర్ ప్రదేశ్ డీజీపీలకు వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు.


వైసీపీ అధినేత జగన్‍తోపాటు అప్పటి టీటీడీ పాలకవర్గం, జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు జగన్ పాల్పడ్డారని, విచారణ చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్యాన్ పార్టీ అధినేతతోపాటు ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై భారత న్యాయ సంహితలోని 152, 192, 196, 298, 353 సెక్షన్ల కింద వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కూడా జగన్ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది వినీత్ జిందాల్ విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

YSRCP: గుడ్‌బై చెబుతున్న నేతలు.. జగన్ దారెటు..

Tirumala laddu: తిరుమల లడ్డూ వ్యవహారం... జగన్‌పై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు

Tirupati Laddu: తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంపై స్పందించిన రమణదీక్షితులు

Updated Date - Sep 20 , 2024 | 01:23 PM