Sajjala Ramakrishna Reddy: షర్మిల కాంగ్రెస్‌లో చేరటం వెనక చంద్రబాబు కుట్ర ఉంది
ABN , Publish Date - Jan 06 , 2024 | 04:56 PM
వైఎస్ షర్మిల ( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కుట్ర ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) ఆరోపించారు. శనివారం నాడు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు.
అమరావతి: వైఎస్ షర్మిల ( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కుట్ర ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) ఆరోపించారు. శనివారం నాడు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కి భవితవ్యం లేదని.. అలాంటి పార్టీని తాము పట్టించుకోమని తెలిపారు. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం సమంజసమేనని అన్నారు. అంగన్వాడీల సమ్మెతో చిన్నపిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారని.. వాళ్ల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పారు. అత్యవసర సర్వీసుల కింద అంగన్వాడీలు ఉన్నారని.. వారు తిరిగి వీధుల్లో చేరాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. అయినా వారు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారని.. అందుకే ఎస్మా చట్టాన్ని ప్రయోగించామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.