Share News

AP NEWS: అవినాశ్‌ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. కారణమిదే

ABN , Publish Date - Dec 08 , 2024 | 06:54 PM

ఈనెల12వ తేదీ వరకు ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పులివెందులలో రాఘవరెడ్డి ప్రత్యక్షమయ్యాడు.సోషల్ మీడియా కేసులో విచారణకు రావాలని రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు వెళ్లిన విషయం తెలిసిందే.నోటీసులు ఇస్తే విచారణకు వస్తానని రాఘవరెడ్డి చెప్పారు.

AP NEWS: అవినాశ్‌ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. కారణమిదే

కడప: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఏపీ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. పులివెందుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 35BNS నోటీసులను పులివెందుల పోలీసులు సర్వ్ చేశారు. రేపు(సోమవారం) ఉదయం 9 గంటలకు కడప సైబర్ క్రైమ్ పోలీస్టేషన్‌లో హాజరు కావాలని నోటీసులిచ్చారు. అయితే పులివెందులలో రాఘవరెడ్డి నెలరోజుల తర్వాత ఇవాళ(ఆదివారం) ప్రత్యక్షమయ్యాడు. వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించి.. వర్ర రవీందర్ రెడ్డి కేసులో రాఘవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈనెల12వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలతో పులివెందులలో రాఘవరెడ్డి ప్రత్యక్షమయ్యాడు.


సోషల్ మీడియా కేసులో విచారణకు రావాలని రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు వెళ్లిన విషయం తెలిసిందే.నోటీసులు ఇస్తే విచారణకు వస్తానని రాఘవరెడ్డి చెప్పారు. అయితే పులివెందుల పోలీసులు వెనుతిరిగి వెళ్లారు. వర్ర రవీందర్ రెడ్డి కేసులో పవన్ కుమార్ అనే వ్యక్తిని డీఎస్పీ మురళి నాయక్ విచారిస్తున్నారు.


కాగా.. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులకు సంబంధించిన కేసులో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డి దాఖలు చేసుకున్న ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ను కడప జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు (4వ అదనపు జిల్లా కోర్టు) కొట్టివేసింది. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌, అనిత, మంద కృష్ణమాదిగ, షర్మిల తదితరులపై వైసీపీ సోషల్‌ మీడియా ఆధ్వర్యంలో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి చెందిన హరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు వైసీపీ సోషల్‌ మీడియా జిల్లా కో-కన్వీనర్‌ వర్రా రవీంద్రరెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి మరికొందరిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఇదే కేసులో బండి రాఘవరెడ్డి (ఏ-20) నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే వర్రాను పోలీసులు అరెస్టు చేశారు.


అతడు ప్రస్తుతం కడప సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు. తనకు ముందస్తు బెయిల్‌ కోరుతూ రాఘవరెడ్డి ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్‌ వేశాడు. పిటిషన్‌‌ను న్యాయాధికారి దీనబాబు విచారించారు. అనంతరం ఆయన సెలవుపై వెళ్లడంతో ఇన్‌చార్జిగా జడ్జిగా వచ్చిన వెంకటేశ్వర రావు (మొదటి అదనపు జిల్లా జడ్జి) విచారణ జరిపారు. రాఘవరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు..


అయితే. ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి గతంలో పోలీసులు సర్చ్ వారెంట్ జారీ చేశారు. లింగాల మండలం అంబక పల్లిలో రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసులు అంటించారు. ఏ క్షణంలోనైనా ఇంట్లో సోదాలు చేయడానికి అనుమతి తీసుకున్నామని అధికారులు తెలిపారు. వారం రోజుల నుంచి పరారీలో ఉన్న అవినాష్ పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ సోషియల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డికి సైతం 41-A నోటీసులు జారీ చేశారు.


మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రమేయం ఉందని ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదురుకుంటున్నారు. సోషల్ మీడియా పోస్టుల్లో సైతం అవినాష్ హస్తం ఉందని తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.


పోలీసుల విచారణలో వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుల కేసులో ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు సంచలనంగా మారింది. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతపై పెట్టిన పోస్టుల వెనుక అసలు కారణం కడప ఎంపీ పీఏ నని తెలుస్తుంది. వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్ నే తాను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు వర్రా రవీందర్ రెడ్డి ఇటీవల పోలీసులకు తెలిపారు. పీఏ రాఘవరెడ్డి అరెస్ట్ అయితే మాత్రం ఎంపీ మెడకు మరో ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని తెలుస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్సార్‌సీపీ పాపాల చిట్టా రెడి..

సీఆర్డీయేలో లంచాల బోగోతం..

బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్

బోరుగడ్డ అనిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 08 , 2024 | 08:30 PM