Perni Nani: ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్
ABN , Publish Date - Dec 17 , 2024 | 08:28 AM
అధికారులు జరిపిన వార్షిక తనిఖీల స్టాక్‌లో భారీగా రేషన్ బియ్యం వ్యత్యాసాన్ని గుర్తించారు. ఆ క్రమంలో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లుగాః గుర్తించారు. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాన, ఆయన భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
కృష్ణా: ఏపీ(ap)లో రేషన్ బియ్యం అక్రమాల (PDS Ration Scam) గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ విషయంలో వైఎస్సార్సీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి (Former Minister) పేర్ని నాని (Perni Nani) చిక్కుల్లో పడ్డారు. రేషన్ బియ్యం మాయంపై పేర్నినాని సతీమణి జయసుధ, ఆయన వ్యక్తిగత కార్యదర్శిపై కూడా కేసు నమోదైంది. జగన్ ప్రభుత్వ హయాంలో నాని సతీమణి పేరిట గోడౌన్ నిర్మించి సివిల్ సప్లయిస్‌కు అద్దెకు ఇచ్చారు. ఆ క్రమంలోనే పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. దీంతో పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
లుక్ అవుట్ నోటీసు జారీ
మచిలీపట్నం గోదాంలో బియ్యం మాయం కేసులో పోలీస్, పౌరసరఫరాల శాఖల్లో కదలిక వచ్చింది. వారం రోజులుగా అజ్ఞాతంలోకి మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ ఉంది. వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. నిన్న సాయంత్రం అజ్ఞాతం నుంచి పేర్ని నాని బయటకొచ్చారు. ఇంకా పేర్ని నాని సతీమణి జయసుధ అజ్ఞాతం వీడలేదు. గోడౌన్లు ఆమె పేరుతో ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అమ్ముకున్న పేర్ని నాని అవినీతి కారణంగా ఆయన భార్య జయసుధకు తిప్పలు తప్పడం లేదు. మచిలీపట్నం జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం పేర్నినాని పిటీషన్లు దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం వెలువడే వరకు అజ్ఞాతంలోనే భార్యను పేర్ని నాని ఉంచారు. నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నప్పటికీ.. వారి ఆచూకీ కొనుగొనడంలో కృష్ణా పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. కొంతమంది అధికారులు, టీడీపీ నేతలు పేర్ని నానికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
భారీ వ్యత్యాసం
అధికారులు జరిపిన వార్షిక తనిఖీల స్టాక్‌లో భారీగా బియ్యం వ్యత్యాసాన్ని గుర్తించారు. ఆ క్రమంలో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లుగాః గుర్తించారు. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 316(3), 316(5), 61(2) రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన సివిల్ సప్లయిస్ అధికారులు లోతైన విచారణ చేయాలని పోలీసులను కోరారు. రేషన్ బియ్యం మాయంపై అప్పటి అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు వారి వివరాలను ఆరా తీస్తున్నారు.
రూ.40 వేల కోట్లకుపైగా అక్రమాలు
ఈ విషయంపై స్పందించిన పేర్ని నాని తూకం చేసే విషయంలో సరిగా చూడకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయని అన్నారు. కానీ వివరణ ఇచ్చినప్పటికీ అధికారి కోటిరెడ్డి అధికారికంగా ఫిర్యాదు చేయడంతో నాని భార్యపై కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో ఏపీ నుంచి జగన్ ప్రభుత్వ హయాంలో రూ.40 వేల కోట్లకుపైగా రేషన్ బియ్యం మాఫియా జరిగిందని పలువురు నేతలు చెబుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే గుంటూరు సహా పలు ప్రాంతాల్లో రేషన్ మాఫియా జరిగినట్లు తేలింది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో ఇంకా ఏ నేతల గుట్టు బయటకు వస్తుందో చూడాలి మరి.
బెయిల్ పిటిషన్
పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ (Anticipatory Bail) కోసం మచిలీపట్నం జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పేర్ని నాని భార్య జయసుధ (Jayasudha) బెయిల్ పిటిషన్ వేశారు. సివిల్ సప్లయి గోదాంలో బియ్యం అవకతవకలపై ఆమెపై కేసు నమోదైంది. ప్రధాన నిందితురాలిగా పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పేర్ని నాని వ్యక్తి గత సహాయకుడు మానస తేజ పేర్ని నానిపై కూడా కేసు నమోదైంది. గత మూడు రోజులుగా పేర్ని నాని అందుబాటులో లేరు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. లీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. కొంతమంది అధికారులు, టీడీపీ నేతలు పేర్ని నానికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP : సజ్జల భార్గవ్ కేసుల వివరాలన్నీ ఇవ్వండి
Political Conflict : వైసీపీ నేతల ఆగడాలు అడ్డుకోండి
AP Skill Development : ఏపీలో 532 స్కిల్ హబ్‌లు
Read Latest AP News and Telugu News