Share News

AP Assembly: వైసీపీ ఎక్సైజ్ పాలసీపై ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏమన్నారంటే?

ABN , Publish Date - Jul 24 , 2024 | 04:39 PM

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎక్సైజ్‌పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మద్యంలో చాలా లోతైన విచారణ జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంతో దోపిడీ దీనిలో జరిగిందన్నారు. రూ.15000 కోట్లు కేంద్రం ఇస్తే ఆనందం వ్యక్తం చేశామని...

AP Assembly: వైసీపీ ఎక్సైజ్ పాలసీపై ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏమన్నారంటే?
AP Assembly Session

అమరావతి, జూలై 24: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. ఎక్సైజ్‌పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) మాట్లాడుతూ.. మద్యంలో చాలా లోతైన విచారణ జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంతో దోపిడీ దీనిలో జరిగిందన్నారు. రూ.15000 కోట్లు కేంద్రం ఇస్తే ఆనందం వ్యక్తం చేశామని... అయితే రాష్ట్రంలో ఎన్నోవేల కోట్లు మద్యంలో దోపిడి జరిగిందని... ఆ సోమ్ము వచ్చి ఉంటే ఎప్పుడో పోలవరం పూర్తయి ఉండేదన్నారు. ఇంత దోపిడీ చేసిన వారిని ఎట్టి పరిస్ధితుల్లో వదల కూడదని అన్నారు. రాజకీయ కక్షసాధింపు కాదని.. తప్పుచేసిన వారికి శిక్ష పడి తీరాలని ముఖ్యమంత్రిని కోరతున్నట్లు పవన్ పేర్కొన్నారు.

CM Chandrababu: వైసీపీ ఎక్సైజ్‌ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆగ్రహం..


చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు

లిక్కర్ విషయంలో అనేక లేఖలు కేంద్రానికి రాసినట్లు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇక్కడ 98 వేల కోట్ల ట్రాన్సాక్షన్ క్యాష్ ద్వారా నడిపారని.. దీనిపై ఎంక్వైరీ జరగాలని కోరుతున్నామని తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ జరిగిన సేల్‌లో 30 శాతం జరిగిందని అంచనా ఉందన్నారు. గతంలో కొన్ని శాంపుల్స్ పరిశీలిస్తే ఇంప్యూరిటీలు ఉండి కిడ్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. ఇంత మంది ఆరోగ్యం, లిక్కర్ కారణం గనుక దానిపైనా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు కోరారు.


లిక్కర్, గంజాయి పెరిగిపోయింది: ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి

‘‘నా క్యాంపెయిన్‌లో రోడ్డుపై అడుగడుగునా జే ట్యాక్స్ కట్టిన వారు అడ్డు వచ్చేవారని ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి అన్నారు. కడప శివారు ప్రాంతాల్లో లిక్కర్, గంజాయి ఎక్కువ అయిపోయిందని.. దీంతో ఒంటిరిగా ఉన్న మహిళలకు ఇబ్బందులు తలెత్తున్నాయన్నారు. వారు ఒంటరిగా ఉంటే వారిపై ఎటాక్ చేస్తున్నారని తెలిపారు.

అలాంటి దారుణాలు ఎవ్వరూ చేయలేదు: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

ఒక్కరోజు కూడా నిలువ లేకుండా రా సరుకును డిస్టిలరీల నుంచి గత ప్రభుత్వం పంపిణీ చేసిందని తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అంతా క్యాష్ ట్రాన్సక్షన్ చేసి ప్రభుత్వాన్ని నడిపారన్నారు. లిక్కర్ విషయంలో మాజీ సీఎం జగన్ చేసిన దారుణాలు ఎవ్వరూ చేయలేదని మండిపడ్డారు. గతంలో ఉన్న బ్రాండ్స్ ఇంకా అమ్ముతున్నామని... అయితే వాటిని వెంటనే ఆపివేయకపోతే ఇబ్బందులు వస్తాయని చెపుతున్నామని అన్నారు.

Telangana: కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారు.. కేటీఆర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్న రేవంత్..!


ఈడీకి అప్పగించాలి: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

బ్రాండ్స్ అమ్మేవాడికి తెలియదు, కొనేవాడుకు తెలియదు కేవలం రేటు ద్వారానే చెబుతారన్నారు. ఒక పంచాయితీలో జే బ్రాండ్ తాగి 20 మంది చనిపోయారని తెలిపారు. ఢిల్లీలో 200 కోట్లు కోసం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి జైలుకు వెళితే ఇక్కడ నెలకు 200 కోట్లు సంపాదించిన ఈయన ఎన్నేళ్లు జైలులో ఉండాలని ప్రశ్నించారు. ఈ కేసును ఈడీకి అప్పగించాలన్నారు.

వారిని శిక్షించాల్సిందే: ఎమ్మెల్యే బుచ్చయ్య

జగన్ నిర్వకం వల్ల నాటు సారా, గంజాయి పెరిగిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ధరలు నిర్ణయించేటప్పుడు ఇతర రాష్ట్రాల్లో రేట్లు పరిగణలోనికి తీసుకోవాలన్నారు. తప్పులు చేసిన వారు పారిపోతున్నారని.. అటువంటి అధికరులను వెనక్కి పిలిచి శిక్షించాలని డిమాండ్ చేశారు.

Viral: అమెజాన్ నుంచి ఒళ్లు గగుర్పొడిచే పార్సిల్.. బాక్స్ తెరిచి చూసి ఖంగుతిన్న యువతి..


సమాచారాన్ని దాచేస్తున్నారు: ఎమ్మెల్యే కూన రవికుమార్

బేవరేజెస్ కంపెనీలు నుంచి డిపోకు వెళ్లకుండా నేరుగా షాపులకు వచ్చేవని.. ఎన్నికల సమయంలో కూడా ఇది జరిగిందని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. అధికారులు సమాచారాన్ని దాచిపెడుతున్నారన్నారు. ఇది కూడా కౌంట్ చేయాలని కోరారు.

ఇది చాలా పెద్ద స్కాం: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

లిక్కర్‌పై ప్రత్యేకమయిన శ్రద్ద బీజేపీ పెట్టిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. మ్యానిఫెక్షరింగ్ కంపెనీలు జగన్ బినామీలే నడిపారన్నారు. 100 కోట్లు, 200 కోట్లు చేసిన వాళ్లే 6 నెలలుగా జైలులో ఉన్నారన్నారు. ఇది చాలా పెద్ద స్కాం అని ఓపెన్ హర్ట్ విత్ ఆర్కేలో చెప్పానని తెలిపారు. దీనిపై సీబీ సీఐడీ, సీబీఐలతో విచారణ చేయించాల్సిన అవసరం ఉందని అన్నారు.


ఇవి కూడా చదవండి..

AP Assembly: అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్

Anitha: జగన్ ది అంత డ్రామా...

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 24 , 2024 | 06:03 PM