Mohammed Shami: ఆ రాత్రి 19వ అంతస్తు బాల్కనీలో నిల్చున్నాడు.. షమీ ఆత్మహత్యాయత్నంపై స్నేహితుడి షాకింగ్ వ్యాఖ్యలు!
ABN , Publish Date - Jul 24 , 2024 | 03:43 PM
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ చేసిన మాయాజాలం క్రికెట్ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతకు ముందు వ్యక్తిగతంగా, ఆటపరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న షమీ ఆ ప్రపంచకప్‌తో మళ్లీ గాడిలో పడ్డాడు.
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ (Worldcup)లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) చేసిన మాయాజాలం క్రికెట్ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతకు ముందు వ్యక్తిగతంగా, ఆటపరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న షమీ ఆ ప్రపంచకప్‌తో మళ్లీ గాడిలో పడ్డాడు. ఆ టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. షమీ జీవితంలో 2018 సంవత్సరం ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అటు ఫ్యామిలీ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ కెరీర్.. రెండూ ఇబ్బందుల్లో పడ్డాయి. ఆ సమయంలో షమీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట.
షమీ భార్య 2018లో అతడిపై గృహ హింస కేసు పెట్టింది. అదే సమయంలో షమీపై ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ రెండింటితోనూ షమీ చాలా నలిగిపోయాడని అతడి స్నేహితుడు ఉమేష్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ``ఆ సమయంలో షమీ నాతో పాటు మా ఇంట్లో ఉండే వాడు. తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను అతడు తట్టుకోలేకపోయాడు. దేశానికి ద్రోహం చేశాడనే ఆరోపణలు అతడికి తీవ్ర మనోవేదన కలిగించాయి. అతడు ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నాడ``ని ఉమేష్ తెలిపాడు.
``ఆ రోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకు నేను మంచి నీళ్ల కోసం నిద్ర లేచాను. అప్పటకి షమీ 19వ అంతస్తులో ఉన్న మా ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్నాడు. ఏం జరుగుతోందో నాకు అర్థమైంది. ఆ రాత్రి షమీ జీవితంలో చాలా సుదీర్ఘమైనది. చివరకు కాస్తా ప్రశాంతంగా మారాడు. తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాఫ్తు చేస్తున్న కమిటీ నుంచి షమీకి క్లీన్ చిట్ వచ్చింది. ఆ రోజు అతడు ఎంత సంతోషపడ్డాడో మాటల్లో చెప్పలేను`` అని ఉమేష్ పేర్కొన్నాడు. 2023 ప్రపంచకప్ తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ ఈ ఏడాది ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌నకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుని ప్రాక్టీస్ ప్రారంభించాడు.
ఇవి కూడా చదవండి..
Hardik Pandya: హార్దిక్ పాండ్యాపై వేటు.. నేనే అతని స్థానంలో ఉండుంటే..
Gautam Gambhir: భారత కోచ్ అయ్యేందుకు గంభీర్‌కు అర్హత లేదు.. పాక్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..