Share News

Margani Bharath: ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. మాజీ ఎంపీ విమర్శలు

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:38 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు నెలల పాలనలో అల్లర్లు, అరాచకాలు తప్ప మరేమీ జరగడం లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రెడ్ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో నడుస్తోందన్నారు. మదనపల్లిలో చంద్రన్న ఫైల్స్ మొదలుపెట్టారని.. సూపర్ సిక్స్ హామీలను పక్కనపెట్టడానికి ఈ వ్యవహారం స్టార్ట్ చేశారని విమర్శించారు.

Margani Bharath: ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. మాజీ ఎంపీ విమర్శలు
Former MP Margani Bharath

అమరావతి, ఆగస్టు 19: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మూడు నెలల పాలనలో అల్లర్లు, అరాచకాలు తప్ప మరేమీ జరగడం లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ (Former MP Margani Bharath) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రెడ్ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో నడుస్తోందన్నారు. మదనపల్లిలో చంద్రన్న ఫైల్స్ మొదలుపెట్టారని.. సూపర్ సిక్స్ హామీలను పక్కనపెట్టడానికి ఈ వ్యవహారం స్టార్ట్ చేశారని విమర్శించారు. హెలికాప్టర్‌లో డీజీపీని సీఐడీ చీఫ్‌ని పంపించి ఆ కేసును ఏం చేశారని ప్రశ్నించారు.

AP Govt: ఫైబర్ నెట్ మాజీ ఎండీపై సస్పెన్షన్ వేటు


అంత హడావుడి చేసి ఏం తేల్చారని అడిగారు. పోలవరంలో కూడా డయాఫ్రం వాల్ చంద్రబాబు వల్ల దెబ్బతిన్నదని నిపుణులు తేల్చి చెప్పారన్నారు. కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ కట్టటం వల్ల నష్టం జరిగిందని.. దాని గురించి చర్చ జరుగుతుండగా ధవళేశ్వరం ఫైల్స్ అని హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నారని నిలదీశారు. అమాయకులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని... వాస్తవాలను బయటకు తీయాలన్నారు. కరకట్ట ఫైల్స్ అని ఇంకో కథ నడిపారన్నారు. సూపర్ సిక్స్ పథకాల ఇష్యూ డైవర్షన్ కోసం కొత్త కథలు అల్లుతున్నారని వ్యాఖ్యలు చేశారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం, చంద్రబాబు చంద్రన్న ఫైల్స్ నడుపుతున్నారంటూ విరుచుకుపడ్డారు.

Vishnukumar Raju: జగన్‌పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు


ధవళేశ్వరం ఫైల్స్ అన్నీ జిరాక్స్ కాపీలు, వేస్టు పేపర్లు అని ఆర్డీవోనే చెప్పారని... మరి ఆ ఫైళ్ల దగ్ధానికి, వైసీపీకి ఏం సంబంధమని నిలదీశారు. ప్రజలను ఎల్లవేళలా అబద్దాలతో నమ్మించలేరన్నారు. శ్రీసిటీలో ఆల్రెడీ ప్రారంభ మైన పరిశ్రమలను చంద్రబాబు ప్రారంభిస్తున్నారని తెలిపారు. రెండు నెలల్లోనే పరిశ్రమలు వచ్చినట్టు జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ హయాంలో శంకుస్థాపన చేసి, ప్రారంభం కూడా అయిన వాటిని చంద్రబాబు మళ్ళీ ప్రారంభించటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీలాగా మా ప్రభుత్వం ప్రచారాలు చేసుకోలేదు. ప్రజల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేయాలి’’ అని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Kitchen Tips: కిచెన్ టవల్ దుర్వాసన వస్తోందా? ఈ టిప్స్ పాటించి చూడండి..!

YS Sharmila: ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 19 , 2024 | 04:41 PM