Kollu Ravindra: రెడ్‌బుక్ పేరెత్తితేనే వైసీపీ నేతల పంచెలు తడిసిపోతున్నాయి
ABN , Publish Date - Aug 16 , 2024 | 04:40 PM
Andhrapradesh: గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్, మైనింగ్ శాఖల్లో ప్రాధమికంగా 50 వేల కోట్ల దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆ రెండు శాఖల్లో దోపిడీపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని అన్నారు.
అమరావతి, ఆగస్టు 16: గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్, మైనింగ్ శాఖల్లో ప్రాధమికంగా 50 వేల కోట్ల దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. శుక్రవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆ రెండు శాఖల్లో దోపిడీపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని అన్నారు. విచారణకు సహకరించకుండా అధికారులు పారిపోతున్నారని చెప్పారు. తప్పు చేయనప్పుడు వీరికి భయమెందుకు? అని ప్రశ్నించారు.
TG Politics: జనగామ బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు..
డిస్టలరీల ద్వారా నాసిరకం మద్యాన్ని సరఫరా చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. అధికారుల ద్వారా గనుల యజమానులను బెదిరించి స్వాధీనం చేసుకున్నారన్నారు. తవ్వే కొద్ది వీరి అవినీతి భాగోతాలు బయటపడుతున్నాయని అన్నారు. రెడ్ బుక్ పేరు ఎత్తితేనే వైసీపీ నేతలకు పంచెలు తడిసిపోతున్నాయంటూ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలలో నుంచి వచ్చిందే రెడ్ బుక్ అని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై మాజీ మంత్రి జోగి రమేష్ దాడి చేసి విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.
Jogi Ramesh: అయ్యన్న భాషకు మనస్తాపం చెందా... అందుకే
ఆనాడు అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించిన కొడాలి నాని, వంశీ, రోజాలు నేడు ఏమయ్యారని అడిగారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఎయిర్ పోర్ట్ నుంచి వెనక్కి తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలు, దౌర్జన్యాలు తదితర అంశాలపై ప్రజా దర్బార్‌లో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి...
Pawan: ఎస్ఎస్ఎల్‌వి-డీ3 విజయవంతం కావడం సంతోషదాయకం
ECI: జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Read latest AP News And Telugu News