Share News

Perni Nani: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం

ABN , Publish Date - Aug 05 , 2024 | 07:45 PM

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన రెండు నెలలుగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో కూడా ఏ రోజు చూడని పోలీసు పోకడలను చూస్తున్నామని విమర్శించారు.

Perni Nani: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం
Perni Nani

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన రెండు నెలలుగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో కూడా ఏ రోజు చూడని పోలీసు పోకడలను చూస్తున్నామని విమర్శించారు. బీహార్, యూపీ రాష్ట్రాలో ప్రభుత్వ ప్రేరేపిత హింస గతంలో చూశామని అన్నారు. ఏపీలో ఇప్పుడు అదే రాజకీయ ప్రేరేపిత హింస మళ్లీ చూస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతల చేతిలో పోలీసులు అగౌరవం పొందుతున్నారని చెప్పారు.


రాష్ట్రంలో జరుగుతున్నరాజకీయ హింసకు సాక్షులుగా నిలుస్తున్నారని అన్నారు. పోలీసుల ముందే హత్యలు జరుగుతున్నాయని అయినా వాళ్లు ఎక్కడా సాక్ష్యం చెప్పరన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సిగ్గు పడాల్సిన విషయం నంద్యాలలో జరిగిన హత్య అని చెప్పారు. రిటైర్డ్ డీజీపీ,రిటైర్డ్ ఐజీ చేతిలో పోలీసు వ్యవస్థ నడుస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ లేదని, శాంతి భద్రతలు లేవని విమర్శించారు. 60 రోజులు నిండినా ఇంకా రక్త దాహం తీరలేదని పేర్ని నాని విమర్శలు చేశారు.

Updated Date - Aug 05 , 2024 | 07:59 PM