TDP Office: టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో నిందితులెవరో తేల్చిన పోలీసులు
ABN , Publish Date - Jul 03 , 2024 | 01:11 PM
Andhrapradesh: టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో పోలీసులు వేగం పెంచారు. వైసీపీ పార్టీ చెందిన ఒక్క ఎమ్మెల్సీ ప్రధాన సూత్రధారి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాడిలో తాడేపల్లికి చెందిన 7 మంది మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు పాల్గొన్నట్లు నిర్ధారించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు.
అమరావతి, జూలై 3: టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై (TDP Central Office) దాడి కేసులో పోలీసులు వేగం పెంచారు. వైసీపీ పార్టీ (YSRCP) చెందిన ఒక్క ఎమ్మెల్సీ ప్రధాన సూత్రధారి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాడిలో తాడేపల్లికి చెందిన 7 మంది మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు పాల్గొన్నట్లు నిర్ధారించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి 150 మందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటుపల్లి, గుంటూరుకు, చెందిన వారే ఎక్కువ మంది దాడిలో ఈ ఘటనలో పాల్గొన్నట్లు గుర్తించారు. దాడిలో పాల్గొన్న నిందితుల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. వైసీపీ నాయకులు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచేరులే టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిపినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
Rajyasabha Updates: విపక్షాలకు ఎప్పటికీ అర్థంకాదు.. రాజ్యసభలో మోదీ సెటైర్లు..
కాగా.. 2021 సంవత్సరం అక్టోబరు 19న మంగళగిరి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. రాడ్లు, కర్రలు, రాళ్లతో వచ్చిన వైసీపీ కార్యకర్తలు... టీడీపీ కార్యాలయ గేట్లు విరగొట్టి మరీ లోపలకు వచ్చారు. కార్యాలయంలో ఉన్న కుర్చీలు, టేబుల్లు, అద్దాలు విరగగొట్టి విధ్వంసం సృష్టించారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు, కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై ఆప్పట్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. తాజాగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.
ఇవి కూడా చదవండి...
CM Chandrababu: సచివాలయం చేరుకున్న సీఎం చంద్రబాబు.. అమరావతిపై కాసేపట్లో శ్వేతపత్రం విడుదల
Pawan Kalyan: ఉప్పాడలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం
Read Latest AP News AND Telugu News