Share News

ADR: దేశంలో అత్యధిక డబ్బులు ఉన్న పార్టీ ఇదే..!!

ABN , Publish Date - Jul 20 , 2024 | 03:43 AM

దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్‌ అగ్రస్థానంలో నిలిచింది. అన్ని ప్రాంతీయ పార్టీల రాబడి రూ.1740.48 కోట్లు కాగా.. ఇందులో గులాబీ పార్టీ ఆదాయమే రూ.737.67 కోట్లు!

ADR: దేశంలో అత్యధిక డబ్బులు ఉన్న పార్టీ ఇదే..!!
BRS Party

  • బీఆర్‌ఎస్‌ ఆదాయం 737 కోట్లు!

  • ప్రాంతీయ పార్టీల్లో అగ్రస్థానం

  • తర్వాత టీఎంసీ, డీఎంకే, బీజేడీ, వైసీపీ: ఏడీఆర్‌


న్యూఢిల్లీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్‌ అగ్రస్థానంలో నిలిచింది. అన్ని ప్రాంతీయ పార్టీల రాబడి రూ.1740.48 కోట్లు కాగా.. ఇందులో గులాబీ పార్టీ ఆదాయమే రూ.737.67 కోట్లు! 42.38 శాతం సొమ్ములు బీఆర్‌ఎస్‌ వద్దే ఉండడం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రాంతీయ పార్టీల ఆదాయం, ఖర్చులపై ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌)’ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2022-23కు గాను దేశంలోని 57 ప్రాంతీయ పార్టీల్లో 39 పార్టీలు సమర్పించిన ఆడిట్‌ రిపోర్టుల ఆధారంగా ఏడీఆర్‌ ఈ నివేదికను రూపొందించింది.


రెండో స్థానంలో టీఎంసీ..!!

రూ.333.45 కోట్ల ఆదాయంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ రెండో స్థానంలో, రూ.214.3 కోట్లతో డీఎంకే మూడో స్థానంలో, రూ.181 కోట్లతో బీజేడీ నాలుగో స్థానంలో, రూ.74.78 కోట్లతో వైసీపీ ఐదో స్థానంలో ఉన్నాయని తెలిపింది. మిగిలిన 34 ప్రాంతీయ పార్టీల రాబడి రూ.199 కోట్లు కావడం గమనార్హం. 2022-23కు రూ.2797.35 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను దేశంలోని రాజకీయ పార్టీలు సొమ్ము చేసుకోగా.. ఇందులో జాతీయ పార్టీలు రూ.1510.61 కోట్లు (54 శాతం), ప్రాంతీయ పార్టీలు రూ.1285.82 కోట్లు (46 శాతం) దక్కించుకున్నట్లు ఏడీఆర్‌ తెలిపింది.

Updated Date - Jul 20 , 2024 | 12:39 PM