CM Revanth: హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Jul 20 , 2024 | 02:57 PM
హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే పదేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. గోపనపల్లి ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌ను (Hyderabad) విశ్వనగరంగా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. వచ్చే పదేళ్లలో భాగ్యనగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. గోపనపల్లి ఫ్లైఓవర్‌ను (Gopanapally flyover) సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు(శనివారం) ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. దీంతో నగరవాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది.
ALSO Read: CM Revanth: ఆ ప్రక్రియను డిసెంబర్ 9లోగా పూర్తి చేస్తాం
రూ. 28.5 కోట్లతో గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిర్మించింది. ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిలో (Serilingampally) చెరువులను కాపాడుతామని అన్నారు. శేరిలింగంపల్లిని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలంగాణకు 65 శాతం ఆదాయం భాగ్యనగరం నుంచే వస్తుందని అన్నారు. ఎక్కడ నుంచి వచ్చిన వారినైనా హైదరాబాద్ హక్కున చేర్చుకుటుందని చెప్పారు. ORR వరకు సమస్యల పరిష్కారం, అభివృద్ధి చేసేందుకు హైడ్రా ఏర్పాటు చేశామని వివరించారు. రూ. లక్ష 50 వేల కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు.
ALSO Read: CM Revanth: ఆ ప్రక్రియను డిసెంబర్ 9లోగా పూర్తి చేస్తాం
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి చేశామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునాదులు వేస్తే... దివంగత మాజీ సీఎం రాజశేఖరరెడ్డి అభివృద్ధి చేశారని తెలిపారు. తాము ఇంకా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని వివరించారు. గతంలో మూసీ అంటే ముక్కు మూసుకునేవారని... మూసీ అంటే విదేశీ పర్యటకులు వచ్చి చూసే లా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఐటీ అంటే ఒక ముఖ్యమంత్రి, ఎయిర్ పోర్ట్ అంటే ఇంకో ముఖ్యమంత్రి గుర్తుకు వస్తారని చెప్పారు. ప్రజాప్రభుత్వం అంటే గుర్తుకు వచ్చేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Telangana: ఢిల్లీకి సీఎం రేవంత్.. ప్రధాన అజెండా అదే..!
Read Latest Telangana News And Telugu News