Pawan Kalyan: పవన్ కల్యాణ్ మన్యం జిల్లా పర్యటనలో భద్రతాలోపం
ABN , Publish Date - Dec 28 , 2024 | 02:19 PM
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 20వ తేదీన మన్యం జిల్లాలో పర్యటించారు. పవన్ పర్యటనలో భద్రతాలోపం లోపించింది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్‌చల్ చేశాడు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఈ నెల 20వ తేదీన మన్యం జిల్లాలో పర్యటించారు. పవన్ పర్యటనలో భద్రతాలోపం లోపించింది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్‌చల్ చేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. భద్రతాలోపాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఆలస్యంగా గుర్తించారు. అసలు నకిలీ ఐపీఎస్ ఎక్కడ నుంచి వచ్చారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నెలకో జిల్లా చొప్పున పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఏడాది నుంచి జనం మధ్యకు వెళ్లేలా పవన్ ప్రణాళికలు చేసుకున్నారు. జిల్లాల్లోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రజలతో నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. ఆయా జిల్లాల్లో వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో క్యాంప్ చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. తన కార్యాలయ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: వారిని ఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం
Bhanuprakash: తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం
Hyderabad: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఎపీఎస్‌ఆర్టీసీ.. అక్కడ్నుంచి ఏకంగా..
Read Latest AP News and Telugu News