Share News

Pawan Kalyan: వారి జోలికి ఎవరొచ్చినా ఊరుకోం

ABN , Publish Date - Aug 15 , 2024 | 12:03 PM

Andhrapradesh: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పవన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవవందాన్ని స్వీకరించారు డిప్యూటీ సీఎం. ఆపై ప్రజలనుద్దేశించి పవన్ ప్రసంగిస్తూ..

Pawan Kalyan: వారి జోలికి ఎవరొచ్చినా ఊరుకోం
Deputy CM Pawan Kalyan

కాకినాడ, ఆగస్టు 15: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day 2024) వేడుకల్లో పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పవన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవవందాన్ని స్వీకరించారు డిప్యూటీ సీఎం. ఆపై ప్రజలనుద్దేశించి పవన్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా క్షీణించాయన్నారు. శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రారన్నారు.

PM Narendra Modi: బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై తొలిసారి స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ


అందుకే శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఆడపిల్లలు, సగటు ప్రజల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదన్నారు. ఇదే విషయం కలెక్టర్, ఎస్పీల సదస్సులోనూ స్పష్టం చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నా భిన్నం అయిపోయిందని విమర్శించారు. జల జీవన్ మిషన్ ప్రాజెక్టులకు పైపులు వేసి మంచి నీటి వసతి ఏర్పాటు చేయలేదన్నారు.

Chandrababu: రాజధాని లేని స్థితి నుంచి రాష్ట్ర పాలన ప్రారంభించాం..


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటే గత ప్రభు త్వం ఋషికొండ ప్యాలెస్ లాంటి విలాస భవనాలను నిర్మించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Anagani Satyaprasad: విశాఖలో జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి అనగాని

CM Chandrababu: మా ప్రభుత్వంలో రాజకీయ కక్షకు తావులేదు... కానీ

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 15 , 2024 | 12:05 PM