Share News

CM Chandrababu: తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 15 , 2024 | 11:27 AM

విజయవాడ: దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నామని, 1946లో విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడామని, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు.

CM Chandrababu: తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నాం: సీఎం చంద్రబాబు

విజయవాడ: దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నామని, 1946లో విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడామని, పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) ప్రాణ త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పేర్కొన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం (78th Independence Day) సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం (Indiragandhi Stadium)లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగిందని, 1956 నవంబర్‌ 1న ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయని, విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితుల్లో నాడు పాలన సాగించామని చెప్పారు. తమ అనుభవం, ప్రజల సహకారంతో కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు. దేశంలో ఎవరూ ఉహించని విధంగా సంస్కరణలతో 13.5 శాతం వృద్ధి రేటు రాష్ట్రం సాధించిందన్నారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమంగా నిలిచిందని, రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించామన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నామని, దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.


రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం బాబు..

ప్రజల సహకారంతో 34 వేల ఎకరాల భూసేకరణ చేశామని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎప్పుడూ నమ్ముతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. నాడు ఐదేళ్లలో సాగునీటి రంగంపై రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, యజ్ఞం మాదిరిగా పోలవరం ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టించామన్నారు.


గత పాలకుల విధ్వంసం: చంద్రబాబు..

ఒక్క ఛాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం (వైసీపీ) రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, బాధితులనే నిందితులను చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నియంత పోకడలు, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారన్నారు. ప్రభుత్వ భూములు, ఆస్తులు దోచుకున్నారని, గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామన్నారు. కొత్తగా 100 ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. అన్నదాత పథకం కింద ఏడాదికి రూ.20 వేలు అందజేస్తామన్నారు.


పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం: సీఎం చంద్రబాబు

2014-19 నాటి పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వమే నేరుగా కాలేజీల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమచేస్తుందన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఫీజుల సమస్యలు ఉండవని అన్నారు. బోధనపై దృష్టిపెట్టడం కోసం టీచర్లపై.. అనవసర యాప్‌ల భారం తొలగించామని చెప్పారు. తమ ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులకు తావులేదని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని ఆయన స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడి. ప్రజల ఆస్తులను దోచుకున్న వారి నుంచి.. ఆ ఆస్తులు చట్టపరంగా తిరిగి రాబట్టి ప్రజలకు అందేలా చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు దశల వారీగా చెల్లింపులు చేస్తామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను అవినీతికి కేంద్రంగా మార్చుకున్న గత ప్రభుత్వం.. రేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

16 మంది ఏపీ ఐపీఎస్‌లకు డీజీపీ షాక్..

రెండోసారి కంటతడి కంటతడి పెట్టుకున్న మంత్రి

టీటీడీలో 58 మంది ఉద్యోగులకు నోటీసులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 15 , 2024 | 11:27 AM