Share News

Actor Dalapathy Vijay: విక్రవాండిలో వీకే తొలి మహానాడు..

ABN , Publish Date - Aug 15 , 2024 | 11:58 AM

నటుడు దళపతి విజయ్‌(Actor Dalapathy Vijay) స్థాపించిన ‘వెట్రి కళగం’ తొలి మహానాడు విల్లుపురం(Villupuram) జిల్లా విక్రవాండిలో కోలాహలంగా జరుగనుంది. సెప్టెంబరు 22వ తేది మహానాడు జరపాలని పార్టీ అన్ని జిల్లాల నిర్వాహకుల వద్ద అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.

Actor Dalapathy Vijay: విక్రవాండిలో వీకే తొలి మహానాడు..

- త్వరలో వెట్రి కళగం జెండా ఆవిష్కరణ

చెన్నై: నటుడు దళపతి విజయ్‌(Actor Dalapathy Vijay) స్థాపించిన ‘వెట్రి కళగం’ తొలి మహానాడు విల్లుపురం(Villupuram) జిల్లా విక్రవాండిలో కోలాహలంగా జరుగనుంది. సెప్టెంబరు 22వ తేది మహానాడు జరపాలని పార్టీ అన్ని జిల్లాల నిర్వాహకుల వద్ద అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మహానాడు నిర్వహణకు ముందే పార్టీ జెండా పరిచయం చేస్తారని తెలిసింది. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నటుడు విజయ్‌(Actor Vijay) తమిళగ వెట్రి కళగం పేరుతో ఫిబ్రవరి 2వ తేది ప్రకటించారు.

ఇదికూడా చదవండి: Wayanad disaster : వయనాడ్‌ విపత్తుకు.. మానవ తప్పిదాలే కారణం!


పార్టీని బలపరిచేలా అన్ని జిల్లాల్లో శాఖలు ఏర్పాటుచేసేలా నిర్వాహకులను కూడా నియమించారు. విక్రవాండి శాసనసభ నియోజకవర్గంలో మహానాడుకు అనువైన స్థలం ఎంపిక చేసే బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌కు విజయ్‌ అప్పగించారు. ముందుగా ద్రావిడ పితామహుడు పెరియార్‌ జన్మించిన ఈరోడ్‌ జిల్లాలో తొలి మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దక్షిణాది జిల్లాల నుంచి వచ్చే పార్టీ నిర్వాహకులకు అవసరమైన రవాణా వసతులు అందుబాటులో ఉండవని భావించి ఈ ఆలోచన మానుకున్నారు.


nani1.2.jpg

కొంతమంది పార్టీ సీనియర్లు ఇటీవల విజయ్‌తో సమావేశమై మహానాడు నిర్వహణ, ఏఏ అంశాలపై తీర్మానాల ఆమోదం వంటి అంశాలపై చర్చించి ముఖ్యమైన సలహాలు కూడా ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు తిరుచ్చి నగరంలో కానీ, మదురైలో కానీ మహానాడు జరిపేందుకు అవసరమైన స్థలాన్ని కూడా పరిశీలించారు. అయితే ఆ రెండు నగరాల్లో ఉన్న స్థల యజమానులు మహానాడు జరుపుకొనేందుకు అభ్యంతరం తెలియజేయడంతో ఈ ప్రయత్నం విరమించారు. మరోవైపున తిరుచ్చి పొన్మలై ప్రాంతంలో ఉన్న రైల్వే గ్రౌండ్‌(Railway Ground)ను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించి, రైల్వే అధికారులను సంప్రదించారు.


అయితే వారు కొన్ని నిబంధనలు విధించిన కారణంగా ఆ ప్రయత్నం కూడా మానుకున్నారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం విక్రవాండిలో డీఎంకే ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడికి చెందిన సూర్య కళాశాల సమీపంలో మహానాడు జరపాలని స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. కాగా సెప్టెంబరు 22వ తేది సుబ్రమణ్యస్వామి వారికి నచ్చిన కార్తీక వ్రత పర్వదినం కావడంతో మహానాడు ఆ రోజునే నిర్వహిస్తే రాజకీయాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగవచ్చని బుస్సీ ఆనంద్‌ తన ఆస్థాన జ్యోతిష్యుడి వద్ద తేది నిర్ణయించినట్లు తెలిసింది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 15 , 2024 | 11:58 AM