-
-
Home » Mukhyaamshalu » Breaking News November 14th Monday Latest Telugu News Live Updates Siva
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Nov 14 , 2024 | 10:44 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-11-14T18:05:14+05:30
రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు
హైదరాబాద్: లగచర్ల ఇష్యూతో తెలంగాణ సర్కారు భంగపడింది
అరెస్టైన వారిని పోలీసులు తీవ్రంగా కొట్టారు
కాంగ్రెస్ కార్యకర్తలను వదిలి బీఆర్ఎస్ వాళ్ళను అరెస్టు చేశారు
పోలీసులు తీరు సరిగా లేదు
మా పార్టీ నేత సురేష్ ఏం తప్పుం చేసిండు
నరేందర్ రెడ్డి నీ ఎందుకు అరెస్టు చేశారు
నాలుగేళ్లలో మేం అధికారంలోకి వస్తాం
ఆంధ్రలో ఏం జరిగిందో తెలంగాణలో అదే జరుగుతుంది
బీఆర్ఎస్ నేతలపై బోగస్ కేసులు పెడుతున్నారు
అధికారులకు అంత స్వామి భక్తి మంచిది కాదు
బాధితులంతా గిరిజనులే
సీఎం రేవంత్ పిచ్చోడు.. వదిలే ప్రసక్తే లేదు
గాయపడ్డ బాధితులను ఢిల్లీ తీసుకెళ్తాం.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తాం
-
2024-11-14T17:54:53+05:30
ఏపీ అసెంబ్లీ వాయిదా
అమరావతి: శాసనసభ రేపటికి వాయిదా
వాయిదా వేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
-
2024-11-14T17:52:18+05:30
ఎన్టీపీసీ రెండు ప్రాజెక్టులు వచ్చాయి
గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు: సీఎం చంద్రబాబు
ఈ నెల 29వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
ఎన్టీపీసీతోపాటు ఏపీ జెన్ కో కలిసి రూ.84 వేల కోట్లతో ప్రాజెక్ట్
గ్రీన్ ప్రాజెక్ట్ మాన్యుఫాక్చరింగ్ జోన్స్ ఏర్పాటవుతాయి: సీఎం చంద్రబాబు
25 వేల మందికి ఉద్యోగాల కల్పన
రాష్ట్రానికి జీఎస్టీ ప్రయోజనాలు కలుగుతాయి
-
2024-11-14T17:47:04+05:30
సీఎం చంద్రబాబు కామెంట్స్
రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి
వ్యవసాయంతో సమానంగా పరిశ్రమల ఏర్పాటు
కంపెనీలు వస్తే రాయితీలు కల్పిస్తా
పరిశ్రమలు నెలకొల్పే వారికి కంపెనీని బట్టి ఇన్సెంటివ్ ఇస్తాం
రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది
ప్రత్యక్షంగా, పరోక్షంగా 7.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశం
-
2024-11-14T17:40:42+05:30
రాజధాని నిర్మాతలు రైతులే: సీఎం చంద్రబాబు
30 వేల మంది రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో భూమి ఇచ్చారు
రైతుకు నమ్మకం కలిగేలా తమ ప్రభుత్వం వ్యవహరిస్తోంది
అమరావతి రాజధాని కోసం ఐదేళ్లు పోరాడారు
ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్‌గా ఏపీ మారుతోంది
పెద్ద ఆస్తి యువత
అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
పారిశ్రామిక వేత్తల కోసం ఉత్తమ పాలసీ తీసుకొచ్చాం
-
2024-11-14T17:30:14+05:30
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కామెంట్స్
అమరావతి: పెట్టుబడిదారులకు రాయితీ ఇస్తున్నాం: సీఎం చంద్రబాబు
ఉద్యోగ కల్పనే మా ప్రభుత్వ లక్ష్యం
దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్‌గా నిలుపుతాం
ఏపీని డ్రోన్ హబ్‌గా మారుస్తాం
ఉద్యోగాల కల్పన కోసమే రకరకాల పాలసీలు తీసుకొచ్చాం
-
2024-11-14T17:27:36+05:30
ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
ఢిల్లీ: రేపు సాయంత్రం ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఎల్లుండి ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహించే చర్చా కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు
ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశం
ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం
అమరావతికి ప్రపంచబ్యాంకు నిధులు, ఏడీబి నిధులపై ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం
-
2024-11-14T16:48:21+05:30
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్
అమరావతి: క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని ఏలితే ఎవరినైనా బలిచేస్తారు
గత ప్రభుత్వం రఘురామను మానసికంగా, శారీరకంగా ఇబ్బందికి గురిచేసింది.
థర్డ్ డిగ్రీ వాడడంతో భయం వేసింది
ప్రభుత్వ వ్యతిరేఖ ఓటును చీలనివ్వకూడదనే ఆలోచనలతో అధికారంలోకి వచ్చాం
ఈ రోజు డిప్యూటీ స్పీకర్‌గా మిమ్మల్ని చూస్తున్నాం
అందరం కలసి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు సభకు ధన్యవాదాలు
మీ మాటకు పదును, హస్యం ఉంటుంది
కర్మ ఎవ్వరిని వదలదు... మీ నియోజరవర్గంలో అడుగుపెట్టనివ్వం అన్న వారు ఇప్పడు సభకు రాలేక పోయారు
ఇప్పుడు వారికి మమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం
చంద్రబాబును ఇబ్బందులు పాలు చేశారు. దాంతో నేను ఎంతో ఆవేదన చెందా
అందుకే ఆనాడు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే మేమంతా బయటకు వచ్చాం
చట్టసభల్లో హుందాతనం పోయింది.
మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను కోల్పోకండి. అదే సమయంలో ప్రజాస్వామ్యం విలువను కాపాడాలి
మనం మార్పు తెస్తామని మనపై ప్రజలు అపారమైన నమ్మకం పెట్టారు
-
2024-11-14T16:37:07+05:30
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
అమరావతి: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు
హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేసిన మండలి చైర్మన్
మండలి చైర్మన్ నిర్ణయం పై హైకోర్టులో సవాలు చేసిన ఇందుకూరి రఘురాజు
మండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని పేర్కొంటూ తీర్పు
అనర్హత వేటు నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని స్పష్టీకరణ
హైకోర్టు నిర్ణయం మేరకు విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈసీఐ నిర్ణయం
ఈ నెల 28న జరగాల్సిన ఉపఎన్నిక ప్రక్రియను పూర్తి స్థాయిలో రద్దు చేసిన ఈసీఐ
-
2024-11-14T16:10:21+05:30
భుజంగరావుకు తాత్కాలిక ఊరట
ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన భుజంగరావు
మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరిన భుజంగరావు
ఇదివరకు భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
గురువారం సాయంత్రంతో ముగిసిన మద్యంతర బెయిల్ గడువు
దీంతో హైకోర్టును ఆశ్రయించిన అదనపు ఎస్పీ భుజంగరావు
సోమవారం సాయంత్రం వరకు మధ్యంతర బెయిల్ గడువును పొడిగించిన హైకోర్టు
విచారణ సోమవారానికి వాయిదా
హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు
తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
-
2024-11-14T14:03:52+05:30
వైసీపీ ఎమ్మెల్సీలపై మంత్రి లోకేష్ ఫైర్..
అమరావతి: శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
జగన్ అసెంబ్లీ రాకుండా పారిపోయడన్న మంత్రి డోలా.
డొలా వ్యాఖ్యల పట్ల వైసిపి సభ్యుల అభ్యంతరం.
2014 - 19 మద్యలో చంద్రబాబు పారిపోలేదా అన్న వైసిపి.
వైసిపి వ్యాఖ్యలపై లోకేష్ ఆగ్రహం.
గత ప్రభుత్వంలో చంద్రబాబు రెండేళ్లు సభలో పోరాడారు.
నా తల్లిని అవమానపరడంతోనే సభ నుంచి చాలెంజ్ చేసి వెళ్లిపోయరు.
చంద్రబాబు సభకు రాకపోయినా మా ఎమ్మెల్యేలు సభకు వచ్చారు.
వైసిపి ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రావడం లేదో చెప్పాలన్న లోకేష్.
తల్లిని అవమానించిన వారిని మేం ప్రోత్సహించమన్న బొత్స.
గత ఎన్నికలలో టికెట్లు ఇస్తే ప్రోత్సహించినట్లు కాదా అన్న లోకేష్.
-
2024-11-14T12:30:08+05:30
ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు..
శుక్రవారం నాడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.
రేపు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి రానున్న చంద్రబాబు.
చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేసిన ఏపీ భవన్ అధికారులు.
ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి కూడా చంద్రబాబు వెళ్లే అవకాశం.
ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం.
అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, ఏడీబి నిధులపై ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం.
-
2024-11-14T12:28:29+05:30
గ్రేటర్‌లో హెల్త్ సైరన్ మోగించిన జిహెచ్ఎంసి..
హైదరాబాద్ : గ్రేటర్‌లో హెల్త్ సైరన్ మోగించిన జిహెచ్ఎంసి.
హోటల్స్, రెస్టారెంట్లపై కొనసాగుతున్న మెరుపు దాడులు.
సిటీలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి సీరియస్.
నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్స్ పై కఠిన చర్యలు.
ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి మేయర్ విజయలక్ష్మి తనిఖీలు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో వెలుగులోకి చూస్తున్న దారుణమైన విషయాలు.
కుళ్ళిన చికెన్, మటన్‌తో బిర్యానీ తయారు చేస్తున్న పలు హోటల్స్.
ఓల్డ్ సిటీ హోటల్స్‌లో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెలను వంటకాల్లో వినియోగిస్తున్నట్లు గుర్తింపు.
మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వాడకంతో ప్రాణాలకే ప్రమాదమంటూ ఫుడ్ సేఫ్టీ అధికారుల హెచ్చరిక.
పలు హోటల్స్‌కు భారీగా పెనాల్టీలు, ఫుడ్ సేఫ్టీ లైసెన్లు రద్దు.
హోటల్స్ నిర్వాహకులు మార్పు వచ్చేంతవరకు తనిఖీలు చేయాలంటూ మేయర్ ఆదేశం.
-
2024-11-14T12:24:53+05:30
అసెంబ్లీకి జగన్ గైర్హాజరుపై లోకేష్ కీలక కామెంట్స్..
అమరావతి: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి నారా లోకేష్ చిట్‌చాట్..
వైసీపీ ఎంఎల్ఏలు అసెంబ్లీకి గైర్హాజరు కావడంపై లోకేష్ వద్ద ప్రస్తావించిన ఎంఎల్ఏలు.
ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.
అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.
అంటే జగన్ ఆయన పార్టీ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదని భావించాలి.
జగన్ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని బహిష్కరించారు అని అర్థం కదా అని వ్యాఖ్యానించిన లోకేష్.
అసెంబ్లీకి రాకపోతే ఆయనను, వాళ్ళ ఎంఎల్ఏలను ఎన్నుకున్న ప్రజలను కూడా జగన్ అవమానించినట్టే కదా అని వ్యాఖ్యానించిన లోకేష్.
వాళ్ళ ఎంఎల్ఏలు కూడా కొంతమంది సభకు రావాలని కోరుకుంటున్నారు అని తెల్సిందన్న టీడీపీ ప్రజాప్రతినిధులు.
-
2024-11-14T12:20:08+05:30
డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన రఘురామరాజు
అమరావతి: రఘురామ కృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రకటించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు.
డిప్యూటీ స్పీకర్ పదవికి మరి ఎవరు నామినేషన్ వేయలేదు.
రఘురామ కృష్ణం రాజు తరఫున మూడు సెట్స్ వేసి ప్రతిపాదించారు.
పవన్ కళ్యాణ్, లోకేష్, విష్ణుకుమార్ రాజులు ప్రతిపాదించారు.
మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో రఘురామ కృష్ణం రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన స్పీకర్.
సభలో హర్ష ధ్వానాలు చేసిన సభ్యులు.
అందరికీ అభివాదం చేసి కృతజ్ఞతలు తెలిపిన రఘురామకృష్ణంరాజు.
మీరు ముహూర్తం చూసుకుని చెబితే ఆ సమయంలో మిమ్ములను సీట్‌లో కూర్చోబెడతాము అని చెప్పిన స్పీకర్.
-
2024-11-14T12:16:18+05:30
రుషికొండ అంశంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ..
రుషికొండపై నిర్మాణాలకు 409 కోట్లు కేటాయించారు: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
రుషికొండపై నిర్మాణాలు జగన్ విధ్వంసానికి పరాకాష్ట.
ఎవరిని వెళ్లనీవ్వనకుండా అడ్డుకున్నారు.
మేము ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేస్తే అతి కష్టం మీద నెల తరువాత సమాధానం వచ్చింది.
రుషికొండ రిసార్ట్స్ ను కావాలని డిస్ట్రక్షన్ జగన్ ప్రారంభించాడు.
రిసార్ట్‌లను కూల్చేసి ఏం కడుతున్నారో కూడా ఎవరికీ చెప్పలేదు.
ఒక నియంత పాలనలో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి.
1 లక్ష 40 వేల చదరపు అడుగులు నిర్మాణాలు చేసారు.
దీనికి మాత్రం రూ. 451 కోట్ల నిధులు సాంక్షన్ చేసారు.
చదరపు అడుగు నిర్మాణానికి రూ. 28,096 ఖర్చు అయింది.
ఇంత ఖర్చు పెట్టీ పేదలకు, పెద్దలకు పోరాటం అని జగన్ బిల్డప్ ఇచ్చారు.
రూ. 409 కోట్లు వ్యయం చేస్తే 22,743 మందికి పేదలుకు ఇల్లు కట్టవచ్చు.
నిర్మాణాలకు ఖర్చు చదరపు అడుగు రూ. 24 వేలు వెచ్చించారు.
ఫర్నిచర్ ఖరీదు రూ. 22 కోట్లు వ్యయం చేశారు.
ముందు టూరిజం రిసార్ట్ అని చెప్పి ఆ తరువాత GO ఇచ్చారు.
సీఎంకు క్యాంప్ ఆఫీస్‌ను వెతికేందుకు ఒక కమిటీ వేసి రుషికొండ ప్యాలెస్‌ను సీఎంకు కేటాయించాలని కమిటీ సిఫార్సు చేసింది.
బాత్ రూమ్‌లో కమ్ ఔట్ ఖరీదు రూ. 16 లక్షలు.
-
2024-11-14T11:15:36+05:30
ఫోన్ టాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్..
మునుగోడు ఉపఎన్నిక సమయాల్లో రెండు నంబర్ల ట్యాప్ చేయించిన లింగయ్య.
ఇద్దరి ప్రైవేట్ వ్యక్తుల ట్యాప్ చేయాలని తిరుపతన్న, భుజంగ రావ్ లకు నెంబర్లు పంపిన లింగయ్య.
ప్రస్తుత నకిరేకల్ ఎం ఎల్ ఏ వేముల వీరేశం అనుచరులు గా ఉన్న మధన్ రెడ్డి, రాజ్ కుమార్.
ఇద్దరి ఫోన్ లు ట్యాప్ చేసినట్టు ఎయిర్టెల్ నుండి రిపోర్ట్
ఈ వ్యవహారంలో నే ఈరోజు లింగయ్యను విచరించనున్న పోలీసులు.
మరోవైపు మధన్ రెడ్డి, రాజ్ కుమార్ ను సైతం ఈరోజు విచారణకు రమ్మన పోలీసులు.
-
2024-11-14T10:44:20+05:30
వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత జంప్..
అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్
టీడీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ మాజీ సలహాదారు ఎస్.రాజీవ్ కృష్ణ
రాజీవ్ కృష్ణతో పాటు టీడీపీలో చేరిన పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు
పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్