Share News

Farmers Protest: భారత్ బంద్ లో విషాదం.. శంభు సరిహద్దులో గుండెపోటుతో రైతు మృతి

ABN , Publish Date - Feb 16 , 2024 | 11:56 AM

తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ర్యాలీలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా సహా వివిధ రైతు సంఘాలు ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

Farmers Protest: భారత్ బంద్ లో విషాదం.. శంభు సరిహద్దులో గుండెపోటుతో రైతు మృతి

తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ర్యాలీలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా సహా వివిధ రైతు సంఘాలు ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ లో అన్ని వర్గాలు పాల్గొనాలని, అందరూ ఒక్కతాటిపై వచ్చి తామంతా ఒకటే అనే భావనను ఎలుగెత్తి చాటాలని రైతులు పిలువునిచ్చారు. ఈ క్రమంలో శంభు సరిహద్దు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న 70 ఏళ్ల రైతు శుక్రవారం ఉదయం గుండె పోటు వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన రైతును చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

మరోవైపు.. రోహ్‌తక్-హిస్సార్ జాతీయ రహదారిపై మదీనా టోల్ ప్లాజా, రోహ్‌తక్-పానిపట్ రహదారిపై మక్రాలీ టోల్ ప్లాజా వైపు రైతులు ర్యాలీగా వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు టోల్ ప్లాజా కార్యకలాపాలను స్తంభింపజేసేందుకు సిద్ధమయ్యారు. భారత్ బంద్ కారణంగా పంజాబ్‌లో బస్సు సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2024 | 12:37 PM