Loksabha Elections: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేత
ABN , Publish Date - Mar 21 , 2024 | 03:30 PM
లోక్ సభ ఎన్నికల వేళ రాజస్థాన్ భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ప్రహ్లాద్ గుంజల్ రాజీనామా చేశారు. ప్రహ్లాద్ గుంజల్ ఉత్తర కోటాలో బీజేపీకి బలమైన నేత. ప్రహ్లాద్ గుంజల్ గురువారం నాడు (ఈ రోజు) కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ ముఖ్య నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు ప్రహ్లాద్ గుంజల్ కీలక అనుచరుడు.
జైపూర్: లోక్ సభ ఎన్నికల వేళ రాజస్థాన్ భారతీయ జనతా పార్టీకి (BJP) గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ప్రహ్లాద్ గుంజల్ (Prahlad Gunjal) రాజీనామా చేశారు. ప్రహ్లాద్ గుంజల్ ఉత్తర కోటాలో బీజేపీకి బలమైన నేత. ప్రహ్లాద్ గుంజల్ (Prahlad Gunjal) గురువారం నాడు (ఈ రోజు) కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ ముఖ్య నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు ప్రహ్లాద్ గుంజల్ (Prahlad Gunjal) కీలక అనుచరుడు. ఆయన బీజేపీకి (BJP) రాజీనామా చేయడంతో రాజస్థాన్ (Rajastan) రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.
రాజస్థాన్‌లో 12 లోక్ సభ నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. జైపూర్, జైపూర్ రూరల్ లోక్ సభ నియోజకవర్గాలకు తొలిరోజున ఇద్దరు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. జైపూర్ లోక్ సభ నియోజకవర్గానికి శశాంక్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. జైపూర్ రూరల్ నియోజకవర్గానికి రైట్ టు రీకాల్ పార్టీ అభ్యర్థి ప్రకాశ్ శర్మ నామపత్రం సమర్పించారు.
మార్చి 23, 24, 25వ తేదీల్లో ప్రభుత్వ సెలవులు ఉన్నందున నామినేషన్లను స్వీకరించరు. మార్చి 22, 26, 27వ తేదీల్లో నామినేషన్ సమర్పించే అవకాశం ఉంది. మార్చి 27వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. మార్చి 28వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. విత్ డ్రా చేసుకునేందుకు మార్చి 30వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్ 19వ తేదీన రాజస్థాన్‌లో 12 లోక్ సభ స్థానాలకు ఎన్నిక జరగనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
Loksabha Elections: వాట్సాప్‌లో వికసిత్ భారత్ మెసేజ్‌లు ఆపండి, కేంద్రానికి ఈసీ ఆదేశం