Congress: ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హై కమాండ్ ఫోకస్ | Congress High Command Focus on AICC purge VK
Share News

Congress: ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హై కమాండ్ ఫోకస్

ABN , Publish Date - Aug 13 , 2024 | 11:32 AM

ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

Congress: ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హై కమాండ్  ఫోకస్

ఢిల్లీ: ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి కర్ణాటక డిప్యూటీ సీఎం పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఏపీ ఇన్‌చార్జ్ మానిక్కం ఠాగూర్ హాజరుకానున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

తెలంగాణతో సహా, 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు ఏఐసీసీ ప్రక్షాళన గురించి ఈ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా యువనేతలకు జాతీయ స్థాయిలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పదవులు ఇవ్వనున్నారు. ఈ రోజు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు, రాష్ట్రాల ఇన్‌చార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీలతో విస్తృత సమావేశంలో మల్లిఖార్జున ఖర్గే మాట్లాడనున్నారు.


కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విస్తృత కార్యాచరణ చేపట్టనున్నారు. తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏఐసీసీ కి కొత్త కార్యవర్గం నియమించనున్నారు. అలాగే, ఏఐసీసీ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాలకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ లను అధిష్టానం నియామకం చేయనుంది.

Updated Date - Aug 13 , 2024 | 11:41 AM