Viral video: ఏసీని పగులగొట్టి.. చివరకు ఎలా తయారు చేశాడో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ABN , Publish Date - Jun 22 , 2024 | 09:15 PM
ఇళ్లల్లోని వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేసి, చివరకు విచిత్ర వస్తువులను తయారు చేయడం చూస్తుంటాం. అలాగే ఒక వస్తువును అంతా ఒక రకంగా వినియోగిస్తే.. కొందరు అదే వస్తువును ..
ఇళ్లల్లోని వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేసి, చివరకు విచిత్ర వస్తువులను తయారు చేయడం చూస్తుంటాం. అలాగే ఒక వస్తువును అంతా ఒక రకంగా వినియోగిస్తే.. కొందరు అదే వస్తువును వినూత్నంగా వినియోగించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఏసీని పగులగొట్టి.. చివరకు ఎలా తయారు చేశాడో చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో పాడైన ఏసీనీ (Old AC) పగులగొట్టి మళ్లీ అందుబాటులోకి తెచ్చాడు. అయితే ఆ ఏసీని చివరకు స్పీకర్‌గా మర్చేశాడు. ఏసీ లోపలి భాగాల్ని తొలగించి, అందులో పెద్ద స్పీకర్ ఏర్పాటు చేశాడు. దానికి సంబంధించిన పరికరాలను ఓ వైపు అమర్చాడు. ఫైనల్‌గా దాన్ని చూస్తే.. నిజంగా స్పీకర్‌ను (Speaker) ఇలా తయారు చేశారేమో అన్నట్లు అనిపిస్తుంది.
పూర్తిగా తయారైన ఏసీ స్పీకర్‌ను ఆన్ చేసి చూడగా.. అందులో నుంచి వచ్చిన సౌండ్ అందరినీ ఆకట్టుకుంది. ఇలా చివరకు పాడైన ఏసీని అతను అందమైన స్పీకర్‌గా మార్చేశాడన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇండియాలో ఇలాంటి తెలివితేటలకు కొదవే లేదు’’.. అంటూ కొందరు, ‘‘కూలింగ్ వర్సెస్ మ్యూజిక్ అన్నమాట’’.. అంటూ ఇంకొందరు, ‘‘కూల్ కూల్ ఎయిర్‌తో పాటూ కూల్ మ్యూజిక్’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 40 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.