Share News

Viral video: సింహం గాఢ నిద్రలో ఉండగా.. దగ్గరికి వెళ్లిన జింక పిల్ల.. అటూ ఇటూ చూసి చివరకు..

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:24 PM

పులులు, సింహాలను చూడగానే మిగతా జంతువులు తమ కాళ్లకు బుద్ధి చెబుతాయి. వాటి ఎదురుగా వెళ్లే ధైర్యం దాదాపు ఏ జంతువూ చేయదు. అయితే కొన్నిసార్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. సింహాలతో...

Viral video: సింహం గాఢ నిద్రలో ఉండగా.. దగ్గరికి వెళ్లిన జింక పిల్ల.. అటూ ఇటూ చూసి చివరకు..

పులులు, సింహాలను చూడగానే మిగతా జంతువులు తమ కాళ్లకు బుద్ధి చెబుతాయి. వాటి ఎదురుగా వెళ్లే ధైర్యం దాదాపు ఏ జంతువూ చేయదు. అయితే కొన్నిసార్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. సింహాలతో పోటీ పడి చివరకు పైచేయి సాధించిన జంతువులు కొన్నైతే.. మరికొన్ని సింహాలతో గేమ్స్ ఆడుతుంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సింహం గాఢ నిద్రలో ఉండగా.. ఓ జింక పిల్ల దగ్గరికి వెళ్లింది. చివరకు అది చేసిన పని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ సింహం వెళ్లకిలా పడుకుని నిద్రపోతుంటుంది. సింహం మంచి గాఢ నిద్రలో ఉండడాన్ని ఓ జింక పిల్ల గమనిస్తుంది. సింహం వద్దకు వెళ్లడానికి ఏం జంతువూ ధైర్యం చేయదు. కానీ ఈ జింక పిల్ల మాత్రం సింహంతోనే గేమ్స్ ఆడాలని అనుకున్నట్లుంది. సింహం దగ్గరగా వెళ్లిన జింక పిల్ల.. అటూ, ఇటూ చూసి కాసేపు గమనించింది. చుట్టూ ఎలాంటి పులులూ, సింహాలూ లేవని నిర్ధారించుకున్నాక.. ఒక్కసారిగా (fawn bitten by lion tail) దాని తోక పట్టుకుని కొరుతుంది. ఆ వెంనే దానికి దొరక్కుండా అక్కడి నుంచి పారిపోతుంది.

Viral video: ప్రాణాల మీదకు తెచ్చిన స్టంట్.. ఈ బాలుడికి చివరకు ఏమైందో చూడండి..


దీంతో అప్పటికాదా గాఢ నిద్రలో ఉన్న సింహం కాస్త.. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. అయితే పూర్తిగా పైకి లేచి చూసే ఓపిక లేక.. మళ్లీ యథావిధగా పడుకుని నిద్రపోతుంది. ఈ సీన్ చూస్తే మనుషులు ఎదుటి వారిని ఆట పట్టించినట్లే అనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ జింక పిల్ల కామెడీ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సింహంతోనే చెలగాటం.. ఈ జింక పిల్ల ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ వీడియోలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: రోడ్డు దాటుతూ కామెడీ చేస్తున్న ఆవులు.. మధ్యలో తెల్లటి గీతలను చూడగానే..

Updated Date - Jun 23 , 2024 | 06:24 PM